డాక్టర్‌నని చెప్పి, టెస్ట్ డ్రైవ్ చేస్తానని, ఆడి కారుతో ఉడాయించాడు
హైదరాబాద్: టెస్ట్ డ్రైవ్ చేస్తానని చెప్పి ఓ వ్యక్తి ఆడి కారును ఎత్తుకెళ్లిన సంఘటన హైదరాబాదులోని బంజారాహిల్స్‌లో శుక్రవారం నాడు చోటు చేసుకుంది. సదరు నిందితుడు తమను బురిడీ కొట్టించడంతో షోరూం యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
కారు కొనేందుకని షోరూంకు వచ్చిన యువకుడు తాను వైద్యుడినంటూ పరిచయం చేసుకున్నాడు. అనంతరం కారు కొంటానంటూ పలు మోడళ్లు పరిశీలించాడు. చివరకు ఓ కారును ఎంపిక చేసుకుని టెస్ట్ డ్రైవ్ చేస్తానని అడిగాడు.

దానికి షోరూం సిబ్బంది అంగీకరించింది. వారు ఏపీ28 బీఆర్ 0005 నంబరు గల ఆడి కారును ఇచ్చారు. దీంతో అతను కారును డ్రైవింగ్ చేసుకొని వెళ్లాడు. వెళ్లిన ఆ వ్యక్తి ఎంతకూ రాలేదు. దీంతో వారు పోలీసుకు ఫిర్యాదు చేశారు. కాగా, వచ్చిన ఆ వ్యక్తి తన పేరు గౌతమ్ రెడ్డిగా చెప్పినట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications