పొగ గొట్టంలో ఇరుక్కుపోయిన దొంగ (ఫోటోలు)
హైదరాబాద్: ‘ఎరక్కపోయి వచ్చాను ఇరుక్కుపోయాను' అని ఓ పాత తెలుగు సినిమాలో అద్భుతమైన పాట ఉంటుంది. ఈ సామెతకు అతికినట్టుగా ఓ తెలివి తక్కువ దొంగ, ఓ ఇంట్లో దొంగతనానికి వెళ్ళి ఇరుక్కుపోయాడు. దొరికిపోవడం సంగతి దేవుడెరుగు, ప్రాణాలతో బయటపడతానా? లేదా? అని ప్రాణ భయంతో ‘రక్షించండి రక్షించండి' అంటూ గగ్గోలు పెట్టాడు.
పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మెదక్ జిల్లా సిద్దిపేట అంబేద్కర్‌నగర్‌లో ఇందిరమ్మకు ఇల్లు ఉంది. ఆమె ఇంట్లో లేదని గ్రహించిన అదే ప్రాంతానికి చెందిన ఎర్రోళ్ల భార్గవ్ (24) అనే యువకుడు ఆ ఇంట్లో దొంగతనానికి ప్లాన్ వేశాడు. ఆదివారం అర్ధరాత్రి ఆ ఇంటిపై ఉన్న పొగగొట్టం ద్వారా ఇంట్లోకి దిగబోయాడు. ఈ క్రమంలో గొట్టంలోని కాంక్రీట్ ఊచల మధ్య చిక్కుకుపోయాడు.

పొగ గొట్టంలో ఇరుక్కుపోయిన దొంగ
‘ఎరక్కపోయి వచ్చాను ఇరుక్కుపోయాను' అని ఓ పాత తెలుగు సినిమాలో అద్భుతమైన పాట ఉంటుంది. ఈ సామెతకు అతికినట్టుగా ఓ తెలివి తక్కువ దొంగ, ఓ ఇంట్లో దొంగతనానికి వెళ్ళి ఇరుక్కుపోయాడు.

పొగ గొట్టంలో ఇరుక్కుపోయిన దొంగ
దొరికిపోవడం సంగతి దేవుడెరుగు, ప్రాణాలతో బయటపడతానా? లేదా? అని ప్రాణ భయంతో ‘రక్షించండి రక్షించండి' అంటూ గగ్గోలు పెట్టాడు.

పొగ గొట్టంలో ఇరుక్కుపోయిన దొంగ
పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మెదక్ జిల్లా సిద్దిపేట అంబేద్కర్‌నగర్‌లో ఇందిరమ్మకు ఇల్లు ఉంది. ఆమె ఇంట్లో లేదని గ్రహించిన అదే ప్రాంతానికి చెందిన ఎర్రోళ్ల భార్గవ్ (24) అనే యువకుడు ఆ ఇంట్లో దొంగతనానికి ప్లాన్ వేశాడు.

పొగ గొట్టంలో ఇరుక్కుపోయిన దొంగ
ఆదివారం అర్ధరాత్రి ఆ ఇంటిపై ఉన్న పొగగొట్టం ద్వారా ఇంట్లోకి దిగబోయాడు. ఈ క్రమంలో గొట్టంలోని కాంక్రీట్ ఊచల మధ్య చిక్కుకుపోయాడు. అటు పైకీ రాలేక, ఇటు కిందికీ దిగలేక ఐదు గంటల పాటు అలాగే ఇరుక్కుపోయాడు.

పొగ గొట్టంలో ఇరుక్కుపోయిన దొంగ
సోమవారం ఉదయం కాలనీలోని చుట్టుపక్కల వారు గమనించి టూటౌన్ పోలీసులకు సమాచారమిచ్చారు. ఎస్‌ఐ వరప్రసాద్ సిబ్బందితో అక్కడికి వచ్చి పొగ గొట్టం పగులగొట్టి దొంగను బయటకు తీశారు. వైద్యం అందించిన అనంతరం భార్గవ్‌ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.












Click it and Unblock the Notifications