అన్నపూర్ణ స్టూడియోలో వ్యక్తి అనుమానాస్పద మృతి
Recommended Video

Annapurna Studios Hides About An Employee Missing
హైదరాబాద్: ఎప్పుడూ సినిమా షూటింగ్‌లతో కలకలలాడే అన్నపూర్ణ స్టూడియోలో గురువారం ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. స్టూడియో పనిచేస్తున్న నారాయణరెడ్డి(53) మృతి చెంది ఉండటాన్ని సిబ్బంది గుర్తించారు.
అయితే, విషయం బయటకు పొక్కకుండా గుట్టుచప్పుడు కాకుండా మృతదేహాన్ని స్టూడియో సిబ్బంది ఉస్మానియా ఆస్పత్రికి తరలించడం అనుమానాలకు తావిస్తోంది.

ఎవరైనా హత్య చేసి ఉండొచ్చని మృతుడి కుటుంబసబ్యులు, బంధువులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ఉస్మానియా వద్ద మృతుడి బంధువులు తమకు న్యాయం చేయాలంటూ ఆందోళనకు దిగారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.












Click it and Unblock the Notifications