బాత్రూమ్ లోకి చొరబడి.. స్నానం చేస్తున్న మహిళపై అత్యాచారయత్నం!

Subscribe to Oneindia Telugu

చేర్యాల: స్నానానికని బాత్రూమ్ లోకి వెళ్లిన ఓ మహిళపై ఓ వ్యక్తి అత్యాచార యత్నానికి ప్రయత్నించాడు. మహిళ గట్టిగా ప్రతిఘటించడంతో.. గ్రామస్తులంతా ఏకమై అతన్ని చితకబాదారు. గురువారం సిద్దిపేట జిల్లా చేర్యాల శివారు ప్రాంతమైన కర్షక నగర్ కాలనీలో ఈ సంఘటన చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే.. కర్షక కాలనీకి చెందిన ఓ వివాహిత స్నానం చేద్దామని బాత్రూమ్ లోకి వెళ్లింది. ఇంతలో అదే కాలనీకి చెందిన పిల్లి యాదామ్ అనే వ్యక్తి బాత్రూమ్ లోకి చొరబడ్డాడు. ఊహించని పరిణామానికి షాక్ తిన్న బాధితురాలు.. గట్టిగా కేకలు పెట్టింది. దీంతో యాదామ్ అక్కడి నుంచి పారిపోవడానికి యత్నించగా.. గ్రామస్తులంతా కలిసి పట్టుకున్నారు.

man tries to rape bathing woman in siddipet

ఆపై అంతా కలిసి దేహశుద్ది చేయడంతో తీవ్ర గాయాలపాలయ్యాడు. ప్రస్తుతం చేర్యాల ప్రభుత్వాసుపత్రిలో అతను చికిత్స పొందుతుండగా.. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A man was tried to rape a bathing woman in cheryala, Siddipet. While she was having bath at her home he entered into bathroom
Please Wait while comments are loading...