ఘోరం: చెల్లెలిపై అన్నయ్య అత్యాచారయత్నం
హైదరాబాద్: చెల్లెలిపై తోడబుట్టిన అన్నయ్యే నీచానికి ఒడిగట్టాడు. చెల్లెలిపై కన్నేసి, కోరిక తీర్చుకోవాలని అనుకున్నాడు. అయితే, వ్యవహారం బెడిసి కొట్టడంతో ఆ ప్రబుద్ధుడు ఊచలు లెక్కిస్తున్నాడు. హైదరాబాదు నగరంలోని కూకట్‌పల్లి హైదర్‌నగర్‌లో ఈ దారుణం జరిగింది.
చెల్లిపై ఓ అన్న అత్యాచారయత్నం చేయబోయాడు. ఆమె చాకచక్యంగా తప్పించుకుని స్థానికులకు సమాచారం అందించడంతో అతడిని పట్టుకున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు.
నల్లగొండ జిల్లాలోని బీబీనగర్‌లో మంగళవారం సాయంత్రం జరిగిన ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందారు. ఓ ప్రైవేటు వెంచర్‌లో ప్రమాదవశాత్తు ట్రాక్టర్ బోల్తా పడటంతో ఈ ఘటన జరిగింది. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనపరుచుకొని, కేసు దర్యాప్తు చేస్తున్నారు.

ఇద్దరు చిన్నారుల మధ్య ప్రారంభమైన ఘర్షణ చిలికిచిలికి గాలివానగా మారడంతో ఓ బాలుడు మృత్యువాత పడ్డాడు. విషాదకరమైన ఈ సంఘటన మెదక్ జిల్లా కోహిర్‌లో జరిగింది. ఇద్దరు చిన్నారుల మధ్య ఘర్షణ ఏర్పడింది. ఘర్షణలో తీవ్ర ఆగ్రహానికి లోనైన బాలుడు మరో బాలుడిపై కర్రతో దాడి చేశాడు. ఈ ఘర్షణలో ముజీబ్ అనే బాలుడు మృతి చెందాడు.
పాతబస్తీలో నకిలీ నోట్ల చెలామణి కలకలం సృష్టిస్తోంది. సమాచారం మేరకు మంగళవారం పాతబస్తీలో దాడులు నిర్వహించిన పోలీసులు రూ.4.68 లక్షల నకిలీ నోట్లను స్వాధీనపరుచుకున్నారు. వీటిని చలామణి చేస్తున్న ఐదుగురు ముఠా సభ్యులను అరెస్టు చేశారు.












Click it and Unblock the Notifications