Let them know uncle: మంచు విష్ణు, మనోజ్ మధ్య బయటపడ్డ విభేదాలు
మంచు విష్ణు, మంచు మనోజ్ మధ్య ఉన్న విభేదాలు బయటపడ్డాయి. తనకు మాజీ అనుచరుడు, ప్రస్తుతం మనోజ్ కు ముఖ్యమైన అనుచరుడిగా వ్యవహరిస్తోన్న సారథిపై మంచు విష్ణు దాడిచేశారు. ఈ దాడిలో సారథికి స్వల్ప గాయాలయ్యాయి. దాడికి సంబంధించిన వీడియోను తన ఫేస్ బుక్ లో స్టేటస్ గా మనోజ్ పెట్టారు. అది సోషల్ మీడియాలో వైరలవుతోంది.
అన్నదమ్ముల మధ్య నెలకొన్న వివాదం గురించి మంచు ఫ్యామిలీలో ఎవరూ స్పందించలేదు. మోహన్ బాబు మాత్రం మనోజ్, విష్ణు.. ఇద్దరిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే స్టేటస్ నుంచి తీసేయాలని చిన్నకొడుకును ఆదేశించడంతో ఆ పోస్టును మనోజ్ డిలిట్ చేశారు. తన మనిషి సారథిపై సోదరుడు విష్ణు దాడిచేశారంటూ పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేసే యోచనలో మనోజ్ ఉన్నట్లు తెలుస్తోంది. తన మనిషిని విష్ణు కొట్టాడని, అలాగే ఇళ్లల్లోకి చొరబడి అందరినీ కొడతాడంటూ మనోజ్ తెలిపారు.

ఇప్పటికే వీరిద్దరూ వేర్వేరు ఇళ్లల్లో నివసిస్తున్నారు. మోహన్ బాబు కుటుంబంలో నెలకొన్న విభేదాలు బయటపడటంతో అన్నదమ్ముల మధ్య ఉన్న విభేదాలు మరోసారి బయటపడ్డాయి. మనోజ్ వివాహ వేడుకల్లో కుటుంబ సభ్యులంతా కనపడినప్పటికీ సాధారణ అతిథుల్లా మోహన్ బాబు, విష్ణు రావడంపై అప్పటికే మంచు కుటుంబంలో వివాదాలు నెలకొన్నాయని సోషల్ మీడియాలో జోరుగా వార్తలు వచ్చాయి. క్రమశిక్షణ కు మారుపేరుగా మోహన్ బాబు కుటుంబం ఉంటుందని, క్రమశిక్షణ తప్పితే తన కుమారుడినైనా దండిస్తానంటూ పలు వేదికలపై మోహన్ బాబు తరుచుగా చెప్పేవారు.

అంతేకాకుండా ట్రోలర్స్ కు మంచు మోహన్ బాబు కుటుంబం ఒక ముడిసరకు లాంటిది. మనోజ్ మినహా మోహన్ బాబు, విష్ణు, మంచు లక్ష్మీప్రసన్న కూడా ట్రోల్స్ కు గురవుతుంటారు. అయితే మనోజ్ ను ట్రోలర్ చేయరు. తమ కుటుంబం గురించి, తమ గొప్పదనం గురించి వీరంతా పదే పదే వేదికలపై ప్రసంగిస్తుండేవారు. అదే ట్రోలర్స్ కు వరంగా మారింది. దివంగత నేతలు భూమా నాగిరెడ్డి, శోభానాగిరెడ్డి రెండో కుమార్తె భూమా మౌనికారెడ్డిని మనోజ్ ద్వితీయ వివాహం చేసుకున్నారు. ఇద్దరికీ ఇది రెండో వివాహమే. వివాహానికి సంబంధించి కుటుంబ సభ్యులంతా దూరంగా ఉండటం, మంచు లక్ష్మీ ఒక్కరే మనోజ్ వివాహాన్ని దగ్గరుండి నిర్వహించారు.












Click it and Unblock the Notifications