Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

మోహన్ బాబు వ్యాఖ్యలు బాధాకరం: ఏపీ, టీ సీఎంలకు మంచు మనోజ్ విన్నపం

తాను, తన భార్య మౌనిక నుంచి ప్రాణ హాని ఉందంటూ తన తండ్రి మోహన్ బాబు చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదన్నారు మంచు మనోజ్. తనకు మంచు మనోజ్, అతని భార్య మౌనిక నుంచి ప్రాణహాని ఉందంటూ మోహన్ బాబు పోలీసులకు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో మంచు మనోజ్ స్పందించారు. తాను తన కుటుంబ ఆస్తి కోసం ఎప్పుడూ ఆశ పడలేదన్నారు.

తన కుటుంబ గౌరవాన్ని కాపాడే ప్రయత్నం చేశారనని మంచు మనోజ్ చెప్పారు. తన ముందే తన కుటుంబసభ్యుల్ని కొందరు కొట్టారని తెలిపారు. తన ఇంటిలో ఉండాల్సిన సీసీ కెమెరాలు మాయమయ్యాయని అన్నారు. తన సోదరుడు విష్ణు అనుచరులే సీసీ కెమెరాల ఫుటేజీని మాయం చేశారని మంచు మనోజ్ ఆరోపించారు.

Manchu Manoj s response to Mohan Babu s complaint that he is in danger of death

తన తండ్రి మోహన్ బాబు తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మంచు మనోజ్ అన్నారు. మోహన్ బాబు విద్య సంస్థల్లో అక్రమాలు జరుగుతున్నాయని చెప్పారు. అయితే, తాను అక్రమాలను నిలదీస్తూ.. బాధితుల పక్షాన నిలబడినట్లు తెలిపారు. అయితే, తాను బాధితుల పక్షాన ఉన్నందుకే తనపై దాడి చేశారని మంచు మనోజ్ చెప్పారు. విష్ణు దుబాయ్‌కు ఎందుకు వెళ్లారో అందరికీ తెలుసన్నారు.

కుటుంబ ఆస్తుల కోసం తానెప్పుడూ ఆశపడలేదన్నారు. ఈ వివాదంలోకి తన కూతుర్ని కూడా చేర్చడం బాధ కలిగించిందన్నారు. గత కొంత కాలంగా తాను మోహన్ బాబు ఇంటికి దూరంగానే ఉంటున్నట్లు చెప్పారు. ఈ కుటుంబ వ్యవహారాల్లో తనకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తనకు అండగా ఉండాలని మంచు మనోజ్ కోరారు.

మంచు మనోజ్ ఫిర్యాదు

తనపై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారని పోలీసులకు ఫిర్యాదు చేశారు మంచు మనోజ్. హైదరాబాద్ పహాడీషరీఫ్ పోలీస్ స్టేషన్‌కు సోమవారం సాయంత్రం వెళ్లిన మనోజ్.. తనపై దాడి జరిగిందని తెలిపారు. జల్‌పల్లిలోని ఇంట్లోనే తనతోపాటు తన భార్యపై తండ్రి మోహన్ బాబు సమక్షంలోనే విద్యానికేతన్ స్కూల్స్ పర్యవేక్షిస్తున్న వినయ్ అనే వ్యక్తి దాడి చేశారని మనోజ్ ఫిర్యాదు చేశారు.

తనపై జరిగిన దాడిలో తీవ్రంగా గాయపడ్డానంటూ.. ఆస్పత్రి రిపోర్టులను కూడా పోలీసులకు అందజేశారు మంచు మనోజ్. తనకు, తన భార్యకు ప్రాణహాని ఉందంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. దాడికి పాల్పడిన వారి వివరాలను పోలీసులకు అందించినట్లు తెలిసింది. మంచు మనోజ్ ఫిర్యాదుపై విచారణ చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. మరోవైపు, మనోజ్, మౌనిక నుంచి తనకు ప్రాణహాని ఉందని మోహన్ బాబు కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనకు రక్షణ కల్పించాలని కోరారు. కాగా, తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు మంచు కుటుంబ వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+