అసెంబ్లీ రద్దు బాధగా ఉంది కానీ: మంచు మనోజ్, షాకిచ్చిన నెటిజన్లు
Recommended Video

హైదరాబాద్: ప్రముఖ నటుడు మంచు మనోజ్ తెలంగాణ అసెంబ్లీ రద్దు పైన స్పందించారు. తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా కల్వకుంట్ల చంద్రశేఖర రావు, కల్వకుంట్ల తారక రామారావుపై ప్రశంసలు కురిపించారు. కేసీఆర్ గురువారం అసెంబ్లీని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దీనిపై మనోజ్ ట్వీట్ చేశారు.
మంచు మనోజ్ ట్వీట్
'సంవత్సరాల పోరాటం మరియు స్వయంపాలన త్యాగం. తొలి అసెంబ్లీ రద్దు కావడం కాస్త బాధగానే ఉంది.. కానీ జరిగింది మంచికే. ప్రజల బాగోగులు చూసుకొనేందుకు మీరు మళ్లీ తిరిగి వస్తారని అనుకుంటున్నా. ఈ మార్పుని నమ్మని ప్రతి ఒక్కరి ఆలోచన తప్పు అని మీరు నిరూపించారు. మీకు మరింత శక్తి రావాల'ని ట్వీట్ చేశాడు. కేటీఆర్, కేసీఆర్ ఫోటోలను కూడా పెట్టారు.
గెలిపిస్తే అయిదేళ్లు గ్యారెంటి ఏమిటి
మంచు మనోజ్ చేసిన ట్వీట్‌పై పెద్ద ఎత్తున కామెంట్లు వచ్చాయి. అయిదేళ్లు పాలించమని ప్రజలు అధికారం ఇస్తే నాలుగున్నరేళ్లకే కేసీఆర్ అసెంబ్లీని రద్దు చేశారని, ఇప్పుడు మళ్లీ గెలిపిస్తే అయిదేళ్లు ఉంటారనే గ్యారెంటీ ఏమిటని ఓ నెటిజన్ ప్రశ్నించారు.
ఈ మంచి మనిషికి సపోర్ట్ చేయండి
మరో నెటిజన్ జనసేనకు మద్దతివ్వాలని మంచు మనోజ్‌ను కోరారు. మీ మంచి మనసుతో మంచు వారి కుటుంబం ఈ మంచి మనిషికి సపోర్ట్ చేయాలని విజ్ఞప్తి చేస్తూ జనసేనాని పవన్ కళ్యాణ్ ఫోటోను పెట్టారు.

ఇంకా పొగడ్తలా?
తెలంగాణ ప్రజలకు ఏం చెయ్యలేక చేతులెత్తేసిన కేసీఆర్ ప్రభుత్వం వారికి ఇంకా పొగడ్తలు ఏమిటని మరికొందరు విమర్శించారు. మరికొందరేమో కేసీఆర్‌కు మద్దతిచ్చినందుకు థ్యాంక్స్ చెప్పారు.












Click it and Unblock the Notifications