మా నాన్న చేసిన తప్పు అదే, ఆ హక్కు లేదు - తేల్చేసిన విష్ణు..!!
మంచు కుటుంబలో వివాదాలు తారా స్థాయికి చేరాయి. మనోజ్ తో వివాదం రచ్చగా మారింది. ఘర్షణలు..కేసులు కొనసాగుతున్నాయి. మనోజ్ తండ్రి పైన గౌరవం ఉందంటూనే.. తన తండ్రి భుజం పై తుపాకీ పెట్టి తనను టార్గెట్ చేసారని ఆరోపిస్తున్నారు. మనోజ్ ను ఉద్దేశించి మోహన్ బాబు విడుదల చేసిన ఆడియో వైరల్ అవుతోంది. ఇటు పోలీసులు కేసులు నమోదయ్యాయి. ఈ సమయంలోనే తొలి సారిగా మంచు విష్ణు ఈ వివాదం పై స్పందించారు. ఆసక్తి కర అంశాలను వెల్లడించారు.
మనోజ్ తో వివాదం
మోహన్ బాబు కుటుంబలో వివాదాలు రోడ్డెక్కాయి. పోలీసు కేసులుగా మారాయి. మోహన్ బాబు పైన ఎఫ్ఐఆర్ నమోదైంది. దీంతో, మోహన్ బాబు కోర్టును ఆశ్రయించారు. అటు రక్షణ కావాలని మోహన్ బాబు, మనోజ్ పోలీసులను అభ్యర్ధించారు. తన తండ్రి మోహన్ బాబు గురించి మనోజ్ కీలక వ్యాఖ్యలు చేసారు. ఈ సాయంత్రం ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి అన్ని అంశాలు వెల్లడిస్తానని చెప్పారు. తాను ఆస్తులు కోరటం లేదని స్పష్టం చేసారు. తాను ప్రేమించి పెళ్లి చేసుకుంటే.. తన భార్యను వివాదంలోకి తీసుకొస్తున్నారని కన్నీటి పర్యంతమయ్యారు.

సోదరితో గ్యాప్
అటు మోహన్ బాబు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇదే సమయంలో తొలి సారి మంచు విష్ణు ఈ వివాదం పై స్పందించారు. ప్రతీ ఇంట్లో వివాదాలు ఉంటాయని.. తమ ఇష్యూ ఎందుకు ఇంతలా సెన్సేషన్ అవుతుందని ప్రశ్నించారు. ఉమ్మడి కుటుంబం అంటే సహజంగా సమస్యలు ఉంటాయని చెప్పుకొచ్చారు. వినయ్ అంటే తనకు అన్న లాంటి వాడు అని పేర్కొన్నారు. తన తండ్రి చేసిన తప్పు ఏదైనా ఉందంటే తమ ముగ్గురు పైన అమితంగా ప్రేమ చూపించటమే అని వ్యాఖ్యానించారు. తన తండ్రి ఇంట్లో స్థానం లేదంటే.. ఉంది అనే హక్కు తనకు లేదన్నారు. అదే విధంగా తన తండ్రి లేకపోతే తాము లేమని.. నాన్న కష్టార్జితమే తమ ఆస్తులని చెప్పారు.
నాన్న ఏది చెబితే అదే
నాన్న ఆస్తి ఆయన ఇష్టమని విష్ణు స్పష్టం చేసారు. తనకు సోదరి లక్ష్మీతో వివాదాలు ఉన్నాయని.. గౌరవంగానే మాట్లాడుకుంటామని వెల్లడించారు. దేవాలయం లాంటి యూనివర్సిటీ పై తప్పుగా మాట్లాడటం తప్పని వ్యాఖ్యానించారు. తమ యూనివర్సిటీ తెరిచిన పుస్తక లాంటిందని చెప్పారు. తామేంటో ఇండస్ట్రీ మొత్తానికి తెలుసన్నారు. గొడవల కారణంగా షూటింగ్ ఆపుకొని వచ్చానని వివ రించారు. తమకు పోలీసులు 9.30 కి నోటీసులు ఇచ్చి 10.30కి రమ్మంటే ఎలా అని ప్రశ్నించా రు. గన్స్ సబ్ మిట్ చేయమన్నారని తెలిపారు. మీడియా పైన దాడి ఉద్దేశ పూర్వకంగా జరగలేదని పేర్కొన్నారు. తన తండ్రి ఏదైనా చెబితే తప్పా..ఒప్పా అని ఆలోచించనని.. ఆయన మాటే తనకు వేద వాక్కు అని చెప్పిన విష్ణు.. మోహన్ బాబు ఏది చెబితే అదే చేస్తానని తేల్చి చెప్పారు.












Click it and Unblock the Notifications