Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కల్తీ మామిడిని కనిపెట్టే సింపుల్ ట్రిక్స్. చెట్టుకు పండితే ఇలా ఉంటుంది

ఎండలు మండుతున్నా, మామిడి పండు పేరు వినగానే నోరూరని వారుండరు. రోడ్ల పక్కన కుప్పలు కుప్పలుగా పోసి అమ్మే పసుపు పచ్చని మామిడి పండ్లు చూపరులను ఇట్టే ఆకర్షిస్తున్నాయి. అయితే, ఈ ఆకర్షణ వెనుక ప్రాణాంతక రసాయనాలు ఉండవచ్చని పోలీసులు, ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కేవలం లాభాల కోసం కొందరు వ్యాపారులు కాల్షియం కార్బైడ్, ఇతర ప్రమాదకర రసాయనాలను ఉపయోగించి పండ్లను బలవంతంగా మగ్గబెడుతున్నారు.

మామిడి పండ్ల విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ సీపీ సజ్జనార్ సూచించారు. "సహజంగా పండిన మామిడి పండు ఎప్పుడూ ఒకే రంగులో (Uniform Color) ఉండదు. రసాయనాలతో మగ్గబెట్టిన పండ్లు మాత్రమే బయటకు చూడటానికి చాలా నిగనిగలాడుతూ, అంతా ఒకే పసుపు రంగులో కనిపిస్తాయి" అని ఆయన పేర్కొన్నారు. ఎక్కడైనా కల్తీ మామిడి పండ్ల విక్రయం లేదా నిల్వ గురించి సమాచారం తెలిస్తే వెంటనే 100 లేదా 8712661212 నంబర్‌కు ఫిర్యాదు చేయాలని కోరారు.

Mango Season Alert How to Spot Calcium Carbide Ripened Mangoes and Stay Safe From Chemical Health Hazards

అసలైన మామిడిని గుర్తించడం ఎలా? (స్మార్ట్ ట్రిక్స్)

మార్కెట్‌కు వెళ్ళినప్పుడు కల్తీ లేని తాజా మామిడి పండ్లను ఎంచుకోవడానికి ఇక్కడ కొన్ని చిట్కాలు ఉన్నాయి..

  • రంగులో తేడా: సహజంగా పండిన పండు అక్కడక్కడా ఆకుపచ్చగా, అక్కడక్కడా పసుపు రంగులో ఉంటుంది. కానీ రసాయనాలతో పండించిన పండు అంతా ఒకే రంగులో (కృత్రిమ పసుపు) మెరిసిపోతుంటుంది.
  • నీటి పరీక్ష: ఒక బకెట్ నీటిలో మామిడి పండ్లను వేయండి. సహజంగా పండిన పండు బరువుగా ఉండి నీటిలో మునుగుతుంది. రసాయనాలతో పండించిన పండు తేలికగా ఉండి నీటిపై తేలుతుంది.
  • వాసన చూడండి: సహజమైన పండును ముక్కు దగ్గర పెట్టుకుంటే తీపి వాసన (Aroma) వస్తుంది. రసాయనాల పండుకు వాసన ఉండదు, ఒకవేళ ఉన్నా అది ఘాటైన రసాయన వాసనలా అనిపిస్తుంది.
  • రుచి చూస్తే తెలిసిపోతుంది: రసాయనాలతో పండిన పండును తిన్నప్పుడు నాలుకపై స్వల్పంగా మంట పుట్టడం లేదా గొంతులో అసౌకర్యం కలుగుతుంది. సహజమైన పండు తిన్నప్పుడు ఆ మధురమైన రుచి నోరంతా తెలుస్తుంది.

మచ్చలుంటే మంచిదేనా?

చాలామంది మామిడి పండుపై నల్లటి మచ్చలు ఉంటే కుళ్ళిపోయిందని అనుకుంటారు. కానీ, సహజంగా పండిన కొన్ని రకాల పండ్లపై చిన్న చిన్న మచ్చలు ఉండటం సహజం. అయితే మరీ మెత్తగా ఉండి, దుర్వాసన వస్తుంటే మాత్రం తీసుకోకూడదు.

రసాయనాలతో పండించిన పండ్లను తింటే కాలేయ సంబంధిత సమస్యలు, గ్యాస్ట్రిక్ ఇబ్బందులు, చర్మ వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి, పండు అందాన్ని చూసి కాకుండా.. దాని నాణ్యతను పరీక్షించి కొనుగోలు చేయడమే ఉత్తమం. ఈ సమ్మర్ సీజన్‌ను ఆరోగ్యకరమైన మామిడి పండ్లతో ఎంజాయ్ చేద్దాం!

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+