వర్సిటీలో జాబ్ ఫెయిర్ షాకింగ్: విద్యార్థులకు డెలివరీ బాయ్స్ ఆఫర్
హైదరాబాద్: మౌలానా ఆజాద్ జాతీయ ఉర్దూ విశ్వవిద్యాలయానికి చెందిన కొందరు విద్యార్థులకు డెలివరీ బాయ్స్ ఉద్యోగాలు చేయమని పిలుపు వచ్చిందట. క్యాంపస్ ఉద్యోగాల్లో భాగంగా రెండు ఈ కామర్స్ బిజినెస్ సంస్థలు వారికి డెలివరీ బాయ్స్‌గా అవకాశం ఇచ్చేందుకు ముందుకు వచ్చాయట.
తద్వారా హై ప్రొఫైల్ ఉద్యోగాలు ఎక్కువ మందికి రావడం లేదంటున్నారు. గత ఏడాది డిసెంబర్ నెలలో సెంట్రల్ యూనివర్సిటీ జాబ్ ఫెయిర్ నిర్వహించింది. ఈ జాబ్ ఫెయిర్‌కు దాదాపు 30 కంపెనీలు వచ్చాయి. అందులో మూడు నాలుగు మల్టీ నేషనల్ కంపెనీలు ఉన్నాయి.

ఈ జాబ్ ఫెయిర్‌లో భాగంగా ఓ విద్యార్థికి అత్యధిక వేతనం ఏడాదికి రూ.3.2 లక్షలు ఆఫర్ చేశారు. షాకింగ్ విషయమేంటే.. ఇందులో కొన్ని డెలివరీ బాయ్ ఉద్యోగాలు కావడం గమనార్హం. రెండు ఈ కామర్స్ బిజినెస్ సంస్థలు ఈ డెలివరీ బాయ్స్ ఉద్యోగాలు ఆఫర్ చేశాయట.
కాగా, ఈ జాబ్ ఫెయిర్‌లో దాదాపు 70 మంది విద్యార్థులు ఉద్యోగాలు పొందారు. ఇందులో 15 మంది ఎంబీయే, 10 మంది ఎంసీయే విద్యార్థులు ఉన్నారు. విద్యార్థులు మంచి కంపెనీ, మంచి వేతనం ఆశించడం తెలిసిన విషయమే.












Click it and Unblock the Notifications