Konda Surekha: మంత్రి కొండా సురేఖపై ఎమ్మెల్యేల ఫిర్యాదు..!
మంత్రి కొండా సురేఖ వ్యవహారశైలి కాంగ్రెస్ పార్టికి తలనొప్పిగా మారింది. కొద్ది రోజుల క్రితం కేటీఆర్ ను విమర్శించే క్రమంలో అక్కినేని నాగ చైతన్య, సమంతపై మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆమె వ్యాఖ్యలను టాలీవుడ్ ప్రముఖులు తీవ్రంగా ఖండించారు. దీంతో ఆమె వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. సమంతకు క్షమాపణ చెప్పాల్సి వచ్చింది. అయినప్పటికీ అక్కినేని నాగార్జున ఈ విషయంలో వెనక్కు తగ్గలేదు. కొండా సురేఖపై పరువు నష్టం దావా కేసు వేశారు. ప్రస్తుతం ఈ కేసు విచారణ కొనసాగుతోంది.
ఇది ఇలా ఉమ్మడి వరంగల్ జిల్లాలో కొండా సురేఖ వ్యవహారశైలి సొంత ఎమ్మెల్యేలకు ఇబ్బందిగా మారింది. బుధవారం ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు మంత్రిపై పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, ఏఐసీసీ వ్యవహారాల ఇంఛార్జ్ దీపాదాస్ మున్షీకి ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. తమను కొండా సురేఖ వర్గీయులు ఇబ్బంది పెడుతున్నారని వారు ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలుస్తోంది. అయితే కార్యకర్తల అత్యుత్సాహం వల్లే పరకాల విషయం ఇష్యూ అయిందని.. అందరితో మాట్లాడి సమస్యలు లేకుండా చేస్తామని మహేశ్ కుమార్ గౌడ్ తెలిపారు.

దసరా సందర్భంగా పరకాలలో మంత్రి కొండా సురేఖ వర్గీయులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఈ ఫ్లెక్సీల్లో స్థానిక ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి ఫొటో లేదు. దీంతో ప్రకాశ్ రెడ్డి మద్దతు దారులు ఫ్లెక్సీలను చించేశారు. దీంతో మంత్రి వర్గీయులు, ప్రకాశ్ రెడ్డి వర్గీయుల మధ్య గొడవ జరిగింది. దీంతో వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విషయం తెలుసుకున్న కొండా సురేఖ పోలీస్ స్టేషన్ కు వెళ్లారు. సీఐ సీట్లో కూర్చుని తన మనుషులనే అరెస్ట్ చేస్తావా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ మారింది.
దీంతో పార్టీ పెద్దలు కొండా సురేఖను హెచ్చరించినట్లు తెలుస్తోంది. జాగ్రత్తగా ఉండాలని.. అనవసర రాద్ధాంతం చేయవద్దని కోరినట్లు సమాచారం. మంత్రి కొండా సురేఖ మొదటి నుంచి ఫైర్ బ్రాండ్ లీడర్ గా ఉన్నారు. ఆమె ఎక్కడా తగ్గుకుండా మాట్లాడుతుంటారు. ఎదురుటి వారు ఎంతవారైనా ఎందురించి మాట్లాడే ధైర్యం ఉంది. అయితే ఇప్పుడు ఈ వ్యవహారశైలి ఆమెను వివాదాల్లోకి నెట్టుతోంది.












Click it and Unblock the Notifications