వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పద్ధతి మార్చుకోండి: టిఆర్‌ఎస్‌ నేతలకు మావోయిస్టు దామోదర్‌ హెచ్చరిక

ప్రజా పోరాటాలకు, ప్రతిఘటనలకు పునాదిగా ఉన్న చిట్యాల, టేకుమట్ల మండల కేంద్రాల్లో ప్రజా వ్యతిరేక విధానాలు సాగిస్తూ టీఆర్‌ఎస్‌ దళారుల చేతుల్లో చిక్కుకుందని మావోయిస్టు నేత దామోదర్‌ ఒక ప్రకటనలో ఆరోపించారు.

|
Google Oneindia TeluguNews

భూపాలపల్లి: ప్రజా పోరాటాలకు, ప్రతిఘటనలకు పునాదిగా ఉన్న చిట్యాల, టేకుమట్ల మండల కేంద్రాల్లో ప్రజా వ్యతిరేక విధానాలు సాగిస్తూ టీఆర్‌ఎస్‌ దళారుల చేతుల్లో చిక్కుకుందని మావోయిస్టు పార్టీ కేకేడబ్ల్యూ కార్యదర్శి దామోదర్‌ ఒక ప్రకటనలో ఆరోపించారు. టేకుమట్ల, చిట్యాల మండలాకు చెందిన అధికార పార్టీ సర్పంచ్‌, గ్రామ మండల అధ్యక్షుడిగా ఉండటంతో తమ అరాచక పాలన చెలాయిస్తున్నారని, స్పీకర్‌ మధుసూదనాచారి అండదండతో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.

చిట్యాల మండలానికి చెందిన వ్యాపారి దేవా సతీష్‌ ఎస్సీ,ఎస్టీ హాస్టళ్ల అమ్మాయిలను బవంతంగా లోబరుచుకుని ఒక అమ్మాయి చావుకు కారణమయ్యారని ఆరోపించారు. నేరం హాస్టల్‌ గార్డ్‌పై నెట్టేసి టీఆర్‌ఎస్‌ పెద్ద అండదండలతో తప్పించుకున్నారని, అతనికి పార్టీ చేతిలో శిక్ష తప్పదని హెచ్చరించారు. ఇక టీఆర్‌ఎస్‌ చిట్యాల, టేకుమట్ల మండలా అధ్యక్షుడు కుంబం రవీందర్‌రెడ్డి పోలీసు ఏజెంట్‌గా వ్యవహరిస్తూ భూ దందాకు ప్పాడుతున్నాడన్నారు.

 maoists issued warnings to TRS leaders

జెన్‌కోలో ఉద్యోగాల పేరిట యువతీయువకుల వద్ద డబ్బు వసూలు చేసి ఉద్యోగాలు ఇవ్వకుండా మోసం చేస్తున్నారని అన్నారు. వసూలు చేసిన డబ్బువెంటనే తిరిగి అప్పగించాలని స్పష్టం చేశారు. అలాగే చింతకుంట రామయ్యపల్లికి చెందిన టీఆర్‌ఎస్‌ నాయకుడు రవీందర్‌రావు డ్వాక్రా మహిళను వేధిస్తూ అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నారన్నారు. అలాగే వారితో పనిచేయించుకుని వేతనం చెల్లించకపోవగా అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని, ఇకనైనా తీరు మార్చుకోవాని హెచ్చరించారు.

చిట్యాల మండలానికి చెందిన తిర్మలాపూర్‌ సర్పంచ్‌ మన్నెనం శ్రీనివాసరావు గ్రామంలో భూ సమస్యకు తెరలేపుతూ పరిష్కారం పేరుతో బాధితుల వద్ద డబ్బు వసూలు చేస్తున్నాడన్నారు. చిట్యాల, టేకుమట్ల మండల కేంద్రాల్లో కొందరు దళాయి పత్రికా విలేకరుల పేరుతో ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారని, ప్రజా వనరులు కొల్లగొడితే సహించేది లేదని దామోదర్‌ హెచ్చరించారు.

ప్రజా పోరాటాలతో సాధించుకున్న తెలంగాణ నేడు పాలకుల తెలంగాణ అయిందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలు, హామీలను విస్మరిస్తూ నిరంకుశత్వ తీరుతో ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆయన ఆరోపించారు.

English summary
Maoists issued warnings to TRS leaders.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X