Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

మోసగించిన భర్తకు బుద్ది, పిల్లల సమక్షంలో వారిద్దరికీ పెళ్ళి

ప్రేమించాడు, పదకొండేళ్ళ సహజీవనం చేశాడు,. ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత ఆమె ఎవరో తెలియదని చెప్పాడు. హైద్రాబాద్ బంజారాహిల్స్ కు చెందిన ఆశ్ క్ అనే వ్యక్తి సుజాతతో పదకొండేళ్ళు సహజీవనం చేసి ఆమె ఎవరో తెలియద

హైదరాబాద్ : పిల్లల సమక్షంలో తల్లిదండ్రులకు వివాహమైంది. ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత తనెవరో తెలియదని బుకాయించాడు.తనకు న్యాయం చేయాలని ఆమె చేసిన ఆందోళనకు చివరకు దిగివచ్చాడు.ఆమెతో వివాహం చేసుకొన్నాడు. ఈ ఘటన హైద్రాబాద్ ఫిలింనగర్ లోచోటుచేసుకొంది. ప్రేమించానని చెప్పాడు, ఆ యువతి వెంటపడ్డాడు,. ఈ విషయం రెండు కుటుంబాలకు తెలిసింది. అయితే అమ్మాయి కుటుంబసభ్యులు ఆమెకు మరోకరితో విహహం చేశారు. అయితే ఆమెను అత్తింటి నుండి తీసుకువచ్చాడు. పదకొండేళ్ళపాటు ఆమెతో సహజీవనం చేశాడు. ఇద్దరు పిల్లలు పుట్టారు. తర్వాత ఆమెను వదిలించుకోవాలని ప్రయత్నించాడు.

హైద్రాబాద్ లోని ఫిలింనగర్ భగత్ సింగ్ కాలనీకి చెందిన ఎస్ పి ఆశోక్ సుజాత అనే యువతిని ప్రేమించి పదకొండేళ్ళ క్రితం ప్రేమించాడు. తొలుత ఆమె తిరస్కరించింది., నీవు లేకపోతే చనిపోతానని బెదిరించాడు. దీంతో ఆమె మనసు కరిగిపోయింది. ఈ విషయం రెండు కుటుంబాల పెద్దలకు తెలిసింది. సుజాత కుటుంబసభ్యులు మరోకరికి ఇచ్చి సుజాత వివాహం చేశాడు.

ఆశోక్ ఇంటి ఎదుట పోరాటం

సు.జాతకు వేరే వ్యక్తితో వివాహం చేయడంతో ఆశోక్ తట్టుకోలేకపోయాడు. సుజాత అత్తింటికి వెళ్ళి ఆమెను తీసుకువచ్చాడు. ఆమెతో కలిసి సహజీవనం చేశాడు. పదకొండేళ్ళపాటు ఆమెతో సహజీవనం చేశాడు. వివాహం చేసుకోవాలని సుజాత కోరితే తన చెల్లెలి వివాహనికి ఇబ్బందులు ఎదురౌతాయని తప్పించుకొంటూ వచ్చాడు..వీరిద్దరికి ఇద్దరు పిల్లలు పుట్టారు. అయితే ఇటీవల సుజాతతో తెగదెంపులు చేసుకోవాలని నిర్ణయించుకొన్నాడు.సుజాతతో సంబంధాలు లేవని తేల్చి చెప్పాడు.

తనతో ఎలాంటి సంబంధం లేదని ఆశోక్ వెళ్ళిపోవడంతో పోరాటమే మార్గమని సుజాత నిర్ణయించుకొంది. ఈ మేరకు ఆమె ఆశోక్ ఇంటి ఎదుట తన పిల్లలతో కలిసి ఆందోళన చేపట్టింది,.ఈ ఆందోళనకు పలు రాజకీయపార్టీలు, మహిళ సంఘాలు మద్దతు పలికాయి.మరో వ్యక్తిని వివాహం చేసుకోవాలని అత్తింటి వారు కోరారు. అయినా ఆమె తన పోరాటాన్ని ఆపలేదు.

అత్తింటివారు వేధింపులను భరించింది.సుజాత తన పోరాటాన్ని విరమించలేదు. సుజాతకు ప్రజాసంఘాలు మద్దతుగా నిలిచాయి.ఫిలింనగర్ కాలనీలోని పలు కాలనీల కుల సంఘాలు ఆమెకు బాసటగా నిలిచాయి.ఆశోక్ పై పోలీసులు కేసు నమోదు చేసి జైలుకు పంపారు. ఆశోక్ ఇంటి తలుపులు పగులగొట్టి ఆమెను ఆశోక్ ఇంటిలో ఉంచారు పోలీసులు.

 marrage in front of children

పిల్లల సమక్షంలో పెళ్ళి
అయితే పరిస్థితి చేయి దాటిపోతోందని ఆశోక్ తల్లిదండ్రులు భావించారు. జైలులో ఉన్న ఆశ్ కో ను కలిసి వివరించారు. సుజాతను వివాహం చేసుకోవాలని కోరారు. ఎట్టకేలకు ఆమెతో వివాహనికి ఆశోక్ ఒప్పుకొన్నారు.ఇద్దరు పిల్లల సమక్షంలో ఆశోక్, సుజాత ల వివాహం ఆదివారం నాడు ఫిలింనగర్ సాయిబాబా దేవాలయంలో జరిగింది. రాజకీయ ప్రముఖులు, కుల సంఘాలు, ప్రజా సంఘాలు ఈ పెళ్ళికి పెద్దలుగా నిలిచారు. ఆదివారం నాడు ఆశోక్ , సుజాతల వివాహం జరిగింది.ఖైరతాబాద్ ఎంఏల్ఏ చింతల రామచంద్రారెడ్డి, స్థానిక కార్పోరేటర్ సూర్యనారాయణ, టిఆర్ఎస్ ఇంచార్జ్ గోవర్థన్ రెడ్డి ,పలు బస్తీల పెద్దలు పాల్గొన్నారు. తన పోరాటానికి అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ సుజాత ధన్యవాదాలు తెలిపారు.

పిల్లల సమక్షంలో తల్లిదండ్రులకు వివాహమైంది. ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత తనెవరో తెలియదని బుకాయించాడు.తనకు న్యాయం చేయాలని ఆమె చేసిన ఆందోళనకు చివరకు దిగివచ్చాడు.ఆమెతో వివాహం చేసుకొన్నాడు. ఈ ఘటన హైద్రాబాద్ ఫిలింనగర్ లోచోటుచేసుకొంది. ప్రేమించానని చెప్పాడు, ఆ యువతి వెంటపడ్డాడు,. ఈ విషయం రెండు కుటుంబాలకు తెలిసింది. అయితే అమ్మాయి కుటుంబసభ్యులు ఆమెకు మరోకరితో విహహం చేశారు. అయితే ఆమెను అత్తింటి నుండి తీసుకువచ్చాడు. పదకొండేళ్ళపాటు ఆమెతో సహజీవనం చేశాడు. ఇద్దరు పిల్లలు పుట్టారు. తర్వాత ఆమెను వదిలించుకోవాలని ప్రయత్నించాడు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+