పెళ్లయ్యాక మరొకరితో ప్రేమ: అది అసాధ్యమని తెలిసి ఇద్దరూ ఆత్మహత్య..
ప్రేమను వదులుకోలేక, దాన్ని సొంతం చేసుకోలేక.. తీవ్ర మనోవేదనకు గురైంది. చివరకు ప్రియుడితో కలిసి ఆత్మహత్య చేసుకుంది.
హైదరాబాద్: పెళ్లయ్యాక.. ఆమె మరొకరితో ప్రేమలో పడింది. అప్పటికే ఇద్దరు సంతానం ఉండటంతో.. సమాజం తమను ఛీత్కరిస్తుందని కృంగిపోయింది. ప్రేమను వదులుకోలేక, దాన్ని సొంతం చేసుకోలేక.. తీవ్ర మనోవేదనకు గురైంది. చివరకు ప్రియుడితో కలిసి ఆత్మహత్య చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. కావ్య(24) అనే వివాహిత భర్త, పిల్లలతో కలిసి కాప్రా జమ్మిగడ్డ ప్రాంతంలో నివాసం ఉంటోంది. అదే ప్రాంతంలో నివాసముంటున్న నాగరాజు(25) అనే ఓప్రైవేట్ ఉద్యోగితో ఆమెకు పరిచయం ఏర్పడింది. పరిచయం కాస్త ఇద్దరి మధ్య ప్రేమకు దారితీసింది. అయితే ఇద్దరం కలిసి బ్రతకడం అసాధ్యమని భావించిన వీరు.. కలిసి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.

ఈ నెల 27న రాత్రి రైలు కిందపడి ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారు. మృతదేహాలను గాంధీ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఆదివారం ఉదయం పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు వారి మృతదేహాలను అప్పగించారు.












Click it and Unblock the Notifications