అమ్మకానికి నేషనల్ హైవే! సర్కారు భూమికి 'పట్టా' అభిషేకం!

ప్రభుత్వ రికార్డుల్లో అక్షర దోషం కాదు.. ఏకంగా అధికారిక భూములే మాయం! కంచే చేను మేసిన చందంగా, రక్షించాల్సిన రెవెన్యూ రికార్డులే భక్షకులకు వరంగా మారాయి. శ్రీశైలం జాతీయ రహదారిపై దళారుల 'పట్టా'భిషేకం జరుగుతోంది. సర్కారు సేకరించిన భూమి, రైతులకు పరిహారం ఇచ్చిన నేల.. ఇప్పుడు రియల్ మాఫియా చేతుల్లో కాసులు కురిపించే 'బంగారు బాతు'గా మారింది. రంగారెడ్డి జిల్లాలో వెలుగు చూసిన ఈ భూ భాగోతం ఇప్పుడు సంచలనం రేపుతోంది!

మీరు కొంటున్న భూమి హైవే పక్కన ఉందా? రికార్డులు పక్కాగా ఉన్నాయని నమ్ముతున్నారా? అయితే ఆగండి.. మీరు కొనేది పట్టా భూమి కాదు, సాక్షాత్తూ జాతీయ రహదారిని కావచ్చు! అవును, రంగారెడ్డి జిల్లా కడ్తాల్‌ పరిధిలో దళారులు ఏకంగా ప్రభుత్వ హైవే భూములకే స్కెచ్ వేశారు. రికార్డుల గారడీతో, మ్యుటేషన్ లొసుగులతో అమాయక కొనుగోలుదారులను అప్పుల ఊబిలోకి నెడుతున్నారు. రెవెన్యూ అధికారుల కళ్లముందే జరుగుతున్న ఈ 'మాయా' జాలం వెనుక అసలు సూత్రధారులు ఎవరు?"

Massive Land Fraud on NH 765 Brokers Exploit Revenue Loopholes to Sell Srisailam Highway Lands Near Future City

హైవే భూములకు 'పట్టా' అభిషేకం!

శ్రీశైలం జాతీయ రహదారి విస్తరణ కోసం 2012లోనే ప్రభుత్వం కడ్తాల్, ఆమనగల్లు పరిధిలో సుమారు 200 ఎకరాల పట్టా భూములను సేకరించింది. రైతులకు నష్టపరిహారం కూడా చెల్లించింది. అయితే, నిబంధనల ప్రకారం ఈ భూములను రెవెన్యూ రికార్డుల్లో 'నేషనల్ హైవే' పేరిట మ్యుటేషన్ చేయాల్సి ఉండగా, అధికారులు ఆ పని చేయకుండా వదిలేశారు. దీనిని అదనుగా తీసుకున్న దళారులు, ఇప్పటికీ రైతుల పేరునే ఉన్న ఆ పాత రికార్డులను చూపిస్తూ అమాయక కొనుగోలుదారులకు గాలం వేస్తున్నారు. హైవే పక్కనే ఖాళీ స్థలం ఉందంటూ ప్రభుత్వ భూమినే ప్రైవేటు వ్యక్తులకు అంటగడుతున్నారు.

రికార్డుల 'మాయాజాలం'.. మ్యుటేషన్ గాలికి!

ఈ కుంభకోణంలో రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. 2014లో జిల్లా విభజన సమయంలో మహబూబ్‌నగర్ నుండి రంగారెడ్డికి రికార్డులు మారే క్రమంలో డేటా మాయమైనట్లు తెలుస్తోంది. సేకరించిన 200 ఎకరాల్లో కేవలం 56 ఎకరాల వివరాలు మాత్రమే అందుబాటులో ఉండటం గమనార్హం. చిత్రం ఏమిటంటే.. ప్రభుత్వం సేకరించిన భూములకు ఇప్పటికీ పాత పట్టాదారులకే 'రైతుబంధు' అందుతోంది, పట్టాదారు పాసు పుస్తకాలు చలామణిలో ఉన్నాయి. కడ్తాల్ మండలంలోనే దాదాపు 58 ఎకరాల ప్రభుత్వ భూమి ఇంకా ప్రైవేటు వ్యక్తుల పేరు మీదనే కొనసాగుతోంది.

ఫ్యూచర్ సిటీ క్రేజ్.. దళారుల రాజ్యం..

దక్షిణ తెలంగాణలో 'ఫ్యూచర్ సిటీ' వస్తుండటంతో శ్రీశైలం హైవే పరిధిలో రియల్ ఎస్టేట్ రంగం ఒక్కసారిగా పుంజుకుంది. పెరిగిన భూముల ధరలను క్యాష్ చేసుకునేందుకు దళారులు బరితెగించారు. కడ్తాల్ రెవెన్యూలో 44.20 ఎకరాలు, కర్కల్‌పహడ్ పరిధిలో 23.25 ఎకరాల హైవే భూమిపై అక్రమ రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. కొన్ని చోట్ల ప్రైవేటు సంస్థల భూములను కూడా తమవేనంటూ విక్రయిస్తున్నారు. కొనుగోలుదారులు మోసపోయామని గ్రహించేలోపే రిజిస్ట్రేషన్లు పూర్తి చేసి చేతులు దులుపుకుంటున్నారు.

అధికారుల మౌనం.. బాధితుల ఆవేదన..

ఈ అక్రమ విక్రయాలపై కడ్తాల్‌కు చెందిన పలువురు బాధితులు రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌కు గ్రీవెన్స్‌లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసి నెల రోజులు గడుస్తున్నా రెవెన్యూ యంత్రాంగం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడం అనుమానాలకు తావిస్తోంది. హైవేకు కేటాయించిన సర్వే నంబర్లను అధికారులు బహిరంగపరచకపోవడంతో సామాన్యులు ఏది ప్రభుత్వ భూమో, ఏది పట్టా భూమో తెలియక మోసపోతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి రికార్డులను సరిచేయాలని, అక్రమ రిజిస్ట్రేషన్లకు అడ్డుకట్ట వేయాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+