రేవంత్ రెడ్డి త‌ర్వాత మాస్ట‌ర్ ప్లాన్ అదేనా..? అందుకే వ్యూహాత్మ‌క నిశ్శ‌బ్దం పాటిస్తున్నారా..?

Recommended Video

    Revanth Reddy's Master Plan Behind His Tactical Silence | Oneindia Telugu

    హైద‌రాబాద్ : కొడంగ‌ల్ లో రేవంత్ రెడ్డి అనూహ్య ప‌రాభ‌వం త‌ర్వాత ప్ర‌జ‌ల మ‌ద్య‌కు వ‌చ్చిన ధాఖ‌లాలు లేవు. ఓట‌మి ప‌ట్ల రేవంత్ రెడ్డి లోతుగా స‌మీక్ష జ‌రుపుతున్న‌ట్టు తెలుస్తోంది. ఒక ఓట‌మి వంద విజ‌యాల‌కు బాట వేస్తుంద‌న్న‌ట్టు త‌ర్వాత కార్యాచ‌ర‌ణ పై రేవంత్ రెడ్డి ద్రుష్టి పెట్టిన‌ట్టు తెలుస్తోంది. ఎఐసీసీ అధినేత రాహుల్ గాంధీ అండ‌దండ‌లు మెండుగా ఉన్న రేవంత్ రెడ్డి తెలంగాణ లో జ‌ర‌గ‌బోయే పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో కీలక బాద్య‌త‌లు పోషించ‌బోతున్న‌ట్టు విశ్వ‌స‌నీయంగా తెలుస్తోంది. అందుకోసం పక‌డ్బందీ ప్ర‌ణాళిక‌తో ముందుకు వెళ్తున్న‌ట్టు తెలుస్తోంది.

     కొడంగ‌ల్ లో ఓట‌మి..! రాజ‌కీయాల్లో గెలుపోట‌ములు స‌హ‌జం అంటున్న రేవంత్..!!

    కొడంగ‌ల్ లో ఓట‌మి..! రాజ‌కీయాల్లో గెలుపోట‌ములు స‌హ‌జం అంటున్న రేవంత్..!!

    అసెంబ్లీ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి ఓటమి అనూహ్య ప‌రిణామం. రేవంత్ గాని, ఆయ‌న అభిమానులు గాని, ఇంకా చెప్పాలంటే టీఆర్ఎస్ కూడా న‌మ్మ‌లేదు రేవంత్ ఓట‌మిని. అయితే, అది జ‌రిగిపోయింది. రేవంత్ తొలిసారి ఓడిపోయారు. దీంతో రేవంత్ షాక్ లో ఉన్నారు. ఫ‌లితాల అనంత‌రం ప్రెస్ నోట్ మిన‌హా ప్ర‌త్య‌క్షంగా అత‌ను అస్స‌లు స్పందించ‌లేదు. నిజంగా రాష్ట్రంలో ఎవ‌రూ ఊహించని ప‌రిణామ‌మే ఇది. మ‌రి త‌న ఓట‌మి గురించి తీవ్ర స‌మీక్ష చేసుకుంటున్నందుకు ఆయ‌న బ‌య‌ట‌కు రావడం లేద‌నే చ‌ర్చ జ‌రుగుతోంది.

    ఓట‌మితో క్రుంగిపోయేది లేదు..! భ‌విశ్య‌త్ బ‌లంగా ఉందంటున్న రేవంత్ వ‌ర్గం..!!

    ఓట‌మితో క్రుంగిపోయేది లేదు..! భ‌విశ్య‌త్ బ‌లంగా ఉందంటున్న రేవంత్ వ‌ర్గం..!!

    ఇదిలా ఉంటే, రేంత్ రెడ్డి పై రాజ‌కీయ చ‌ర్చ‌లు మొద‌ల‌య్యాయి. అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ప‌రాభ‌వం ఎదురైన‌ప్ప‌టికి స‌మ‌ర్థ‌వంత‌మైన నేత‌కు ఎన్నో అవ‌కాశాలు వ‌స్త‌య‌నే ధీమాను ఆయ‌న అనుచ‌రులు వ్య‌క్తం చేస్తున్నారు. లోక్‌స‌భ కు రేవంత్ పోటీ చేస్తార‌నే అంశం పై పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌రుగుతోంది. పార్ల‌మెంటు కు వెళ్లేందుకు ఆయ‌న ప్ర‌ణాళిక‌లు వేస్తున్నార‌ని, పార్టీ కూడా రేవంత్ ప్ర‌తిపాద‌న‌ను కాద‌న‌దని అంటున్నారు. మహబూబ్‌నగర్‌, లేదా మ‌ల్కాజ్ గిరి పార్లమెంట్‌ నుంచి ఆయ‌న పోటీలో దిగుతార‌ని పార్ల‌మెంట్ సెగ్మెంట్ల గురించి కూడా వార్తలు వ‌స్తున్నాయి. పైగా ఇదే మంచిత‌రుణం అని ఆయ‌న అభిమానులు కూడా న‌మ్ముతున్నారు.

     పార్ల‌మెంట్ కు పోటీ చేయ‌ల‌నేది రేవంత్ వ్యూహం..! అదిష్టానం తో సంప్ర‌దింపులు..!!

    పార్ల‌మెంట్ కు పోటీ చేయ‌ల‌నేది రేవంత్ వ్యూహం..! అదిష్టానం తో సంప్ర‌దింపులు..!!

    తెలంగాణ ప్ర‌భుత్వాన్ని, ముఖ్య‌మంత్రి చంద్ర‌శేఖ‌ర్ రావు విధానాల‌ను తీవ్ర స్తాయిలో విమ‌ర్శించే రేవంత్ రెడ్డి అంతే స్థాయిలో ఆలోచిస్తార‌నేది జ‌గ‌మెరిగిన స‌త్యం. అసెంబ్లీ ఎన్నిక‌ల్లో త‌న ఓట‌మి ప్ర‌భావం ఎక్కువ‌రోజులు ప్ర‌జ‌ల్లో ఉండ‌ద‌నేది రేంత్ రెడ్డి విశ్వాసంగా తెలుస్తోంది. అందుకే రాజ‌కీయాల్లో అవ‌కాశాలు ఎప్పుడు ఏ రూపంలో వ‌స్తాయో, క‌లిసి వ‌చ్చిన అవ‌క‌శాన్ని అందిపుచ్చుకుని రాజ‌కీయాల్లో మ‌రో అడుగు ముందుకు వేయాల‌న్న‌దే ఆయ‌న ల‌క్ష్యంగా క‌నిపిస్తోంది.

    రాజ‌కీయాల్లో ఏదైనా సాద్య‌మే..! అలాగే ఏదీ కూడా శాశ్వ‌తం కాదంటున్న రేవంత్ వ‌ర్గం..!!

    రాజ‌కీయాల్లో ఏదైనా సాద్య‌మే..! అలాగే ఏదీ కూడా శాశ్వ‌తం కాదంటున్న రేవంత్ వ‌ర్గం..!!

    అయితే, క‌చ్చితంగా రేవంత్ రెడ్డి లోక్‌స‌భ‌కు పోటీ చేసి, ఒక వేళ కాంగ్రెస్ పార్టీ అదికారంలోకి వ‌స్తే ఏఐసిసి అండ‌దండ‌ల‌తో కేంద్ర మంత్రి ప‌ద‌వి చేప‌ట్టాల‌నేది ఆయ‌న వ్యూహంగా తెలుస్తోంది. కేంద్ర మంత్రి స్థాయిలో రాష్ట్రంలో ప‌ర్య‌టిస్తే ముఖ్య మంత్రి స్థాయి ప్రోటోకాల్ ఉంటుంద‌నేది రేవంత్ రెడ్డి మాస్ట‌ర్ ప్లాన్ గా తెలుస్తోంది. రేవంత్ రెడ్డి ల‌క్ష్యం ముఖ్య‌మంత్రి పీఠం కాబ‌ట్టి ముందు దాని ద‌రిదాపుల్లోకి వెళ్లాల‌నేది ఆయ‌న టార్గెట్ గా తెలుస్తోంది.అందుకోసం కొడంగ‌ల్ ఓట‌మి స‌మీక్షించుకుంటూనే భ‌విశ్య‌త్ ప్ర‌ణాళిక‌ను డిసైన్ చేసుకుంటున్న‌ట్టు తెలుస్తోంది. రాజ‌కీయాల్లో ఎప్పుడు, ఎవ‌రు, ఏ రూపంలో చ‌క్రం తిప్పుతారో ఎవ‌రికి అంత తొంద‌ర‌గా అంతుచిక్క‌దు సుమీ..!!

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+