మంథని మధుకర్ మృతి కేసులో తొలి యాక్షన్: సీఐ ప్రభాకర్‌పై వేటు..

ప్రభాకర్‌పై వేటుతో మంథని మధుకర్ మృతి వ్యవహారంలో తొలి యాక్షన్ తీసుకున్నట్లయింది. ఆయన స్థానంలో కొత్త సీఐగా నతేష్ ను నియమిస్తూ బుధవారం పోలీస్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

హైదరాబాద్: మంథని మధుకర్ అనుమానస్పద మృతి వ్యవహారంలో ఎట్టకేలకు మంథని సీఐ ప్రభాకర్ పై వేటు పడింది. కేసును పక్కదోవ పట్టించి జరిగిన హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నించారని సీఐ ప్రభాకర్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

ప్రభాకర్‌పై వేటుతో మంథని మధుకర్ మృతి వ్యవహారంలో తొలి యాక్షన్ తీసుకున్నట్లయింది. ఆయన స్థానంలో కొత్త సీఐగా నతేష్ ను నియమిస్తూ బుధవారం పోలీస్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కేసును తొలుత విచారించిన సీఐ బాధిత కుటుంబాన్ని బెదిరించి కేసును ఆత్మహత్యగా క్లోజ్ చేశారన్న ఆరోపణలు ఎదుర్కొన్నారు. దీంతో కేసు విచారణను సైతం పెద్దపల్లి ఏసీపీ సింధుశర్మకు బదిలీ చేయడం జరిగింది.

Mathani ci prabhakar transfered on the allegations of madhukar death

మధుకర్ మృతదేహానికి రెండు మూడురోజుల్లో రీపోస్టు మార్టమ్ నిర్వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ ఘటనలో స్థానిక ప్రజాప్రతినిధి పుట్ట మధుపై తీవ్ర ఆరోపణలు ఉండటం.. ఘటనను నిరసిస్తూ దళిత సంఘాలు, ప్రజాసంఘాలు మెరుపు ధర్నా నిర్వహించడంతో మధుకర్ మృతి ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+