కెసిఆర్, కెటిఆర్‌ల బాధ్యతలు అప్పగించారు.. నిలబెడతాం: మేయర్, డిప్యూటీ

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు, మంత్రి కెటి రామారావు తమ పైన నమ్మకం ఉంచి తమకు పదవులు ఇచ్చారని, వారి నమ్మకాన్ని నిలబెడతామని మేయర్ బొంతు రామ్మోహన్, డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్ శుక్రవారం చెప్పారు.

వారు జిహెచ్ఎంసి కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. సామాన్య కార్యకర్తలకు ముఖ్యమంత్రి కెసిఆర్ మేయర్‌గా, డిప్యూటీ మేయర్‌గా అవకాశమిచ్చారని బొంతు చెప్పారు. ఉద్యమంలో ఏ విధంగా పని చేశామో జిహెచ్ఎంసి అభివృద్ధి కోసం అలాగే కృషి చేస్తామని చెప్పారు.

Photos: మేయర్ ఎన్నిక సందడి

Mayor and Dy Mayor press meet in GHMC office

ఉద్యమంలో చూపిన ఉత్సాహం పనిలో తప్పకుండా చూపిస్తామని చెప్పారు. ఉద్యమంలో నిబద్ధతతో పని చేసిన తమ పైన నమ్మకంతో ముఖ్యమంత్రి కెసిఆర్, మంత్రి కెటి రామారావు తమకు బాధ్యతలు అప్పగించారన్నారు. వారి నమ్మకాన్ని నిలబెడతామని చెప్పారు. ప్రజలకు మేం వారధిలా ఉంటామని చెప్పారు.

హైదరాబాదును విశ్వనగరంగా తీర్చిదిద్దాలనే కెసిఆర్ తమకు అవకాశమిచ్చారని చెప్పారు. నగర అభివద్ధి కోసం తీసుకునే నిర్ణయాల పైన అవగాహన చేసుకోవాల్సిన ఉందని చెప్పారు. ప్రజా సమస్యల పైన ముందుగా దృష్టి సారిస్తామని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+