'ఏం జరిగిందో చెప్పండి': హనీషా చౌదరి ఆత్మహత్య కేసులో ట్విస్ట్, ప్రియుడిపై విచారణ
హైదరాబాద్: ప్రియుడు చూస్తుండగానే లైవ్‌లో ఆత్మహత్య చేసుకున్న హనీషా చౌదరి కేసులో ఆమె తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. హనీషా, ఆమె ప్రియుడు దీక్షిత్ పటేల్‌ల మధ్య జరిగిన వాట్సాప్ సందేశాల్లో కొన్ని డీలీట్ అయ్యాయా అనే కోణంలో దర్యాఫ్తు చేస్తున్నారు.
Recommended Video

ఇప్పటికే దీక్షిత్ పటేల్ ఆమెపై ఎలాంటి ఒత్తిడి చేయలేదని, ఆమెను ఆత్మహత్యకు ప్రేరేపించలేదని పోలీసుల విచారణలో ప్రాథమికంగా తేలింది. పోలీసులు అన్ని కోణాల్లో దర్యాఫ్తు చేస్తున్నారు. ఆమె వాట్సాప్ సందేశాలు కొన్ని డిలీట్ అయ్యాయని అంటున్నారు. ఆ కోణంలోను దర్యాఫ్తు చేస్తున్నారు.

అన్ని కోణాల్లో దర్యాఫ్తు
హైదరాబాదు కొంపల్లిలోని శివశివానీ కాలేజీలో ఎంబీయే రెండో సంవత్సరం చదువుతున్న అనంతపురం జిల్లాకు చెందిన హనీషా చౌదరి ఇటీవల తన ప్రియుడు దీక్షిత్ పటేల్‌తో అర్ధరాత్రి లైవ్ చాట్‌లో మాట్లాడుతూ ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఈ కేసును పోలీసులు అన్ని కోణాల్లో దర్యాఫ్తు చేస్తున్నారు.

ఏం జరిగిందో చెప్పమంటున్నారు
హనీషా చౌదరి తల్లిదండ్రులు పోలీసులను కలిసి తమ కూతురు చనిపోవడానికి గల కారణాలను చెప్పాలని కోరారు. ప్రియుడి ప్రేరణతో చనిపోయిందా అనే అనుమానాలు వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. తల్లిదండ్రులు కలవడంపై పోలీసులు మాట్లాడుతూ.. వారు అనుమానం వ్యక్తం చేయలేదని, ఏం జరిగిందో చెప్పమని అడిగారని తెలిపారు. వీడియో చాటింగులు డిలీట్ అయ్యాయని అంటున్నారని తెలిపారు.

రికార్డుల ప్రకారం
హనీషా చౌదరి, దీక్షిత్ పటేల్‌ల మధ్య ఏడాదిన్నరగా ఫ్రెండ్‌షిప్ ఉందని, అనంతపురంలో ఓ పెళ్లి కోసం అతనికి చెప్పగా, అతను సరేనని చెప్పాడని, తాము పరిశీలించిన రికార్డులు, విచారణ మేరకు అతను అభ్యంతరం చెప్పలేదని, కానీ కొన్ని డిలీట్ చేశారని అంటున్నారని చెబుతున్నారు. అయితే తాను పెళ్లికి వెళ్తే అనుమానం వస్తుందేమోనని ఆమె ఒత్తిడికి లోనై ఆత్మహత్య చేసుకున్నట్లుగా ప్రాథమికంగా తేలిందని, అయినా విచారణ లోతుగా చేస్తున్నామన్నారు.

అనుమానాలు నివృత్తి
హనీషా తల్లిదండ్రుల అనుమానాల మేరకు విచారణ జరిపి, వారికి అనుమానాలు ఉంటే పోలీసులు నివృత్తి చేయనున్నారు. ఆమె సూసైడ్ చేసుకోవడానికి అతను ప్రేరేపించారా అనే కోణంలో దర్యాఫ్తు చేస్తున్నారు. కాగా, హనీషాకు అనంతపురంలో ఓ స్నేహితుడు ఉన్నారు. అతని పెళ్లికి వెళ్తే దీక్షిత్ అనుమానిస్తాడేమోనని ఒత్తిడికి గురై ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే.
-
హైదరాబాద్ లో 100 కు పైగా ఎకరాల్లో.. -
ప్రేమ పేరుతో గొడ్డు మాంసం తినిపిస్తూ.. మతం మార్చి నరకయాతన! -
ఏప్రిల్ 14న మేషరాశిలోకి సూర్యుడు.. వీరి పంట పండుతుంది! -
ఉచిత విద్యుత్, రూ. 25,000 ప్రసూతి సాయం: ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టిన విజయ్ -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
పదో తరగతి పరీక్షల్లో పొరపాట్లు, ఆ రెండు సబ్జెక్టుల్లో మార్కుల యాడింగ్..ఇలా..!! -
కేంద్రం బ్రహ్మాస్త్రం: రూ. 2.5 లక్షల కోట్ల భారీ పథకం -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ! -
చుక్కలు చూపుతున్న పసిడి రేట్లు -
ఎవరైనా ఇలా చేస్తే అమరావతి చట్టబద్ధత రద్దవుతుంది: బాంబు పేల్చిన సాయిరెడ్డి -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ..












Click it and Unblock the Notifications