కిడ్నాప్ కాదు: ప్రేమించి పెళ్లాడిన వైద్య విద్యార్థిని

హైదరాబాద్‌: కిడ్నాప్‌ కలకలం రేపిన ఎంబీబీఎస్‌ విద్యార్థిని తాను ప్రేమించిన వ్యక్తిని వివాహమాడింది. ఈ విషయాన్ని వైద్యవిద్యార్థినితో పాటు ఆమెను పెళ్లాడిన యువకుడు శుక్ర వారం స్వయంగా హైదరాబాదులోని లంగర్‌హౌజ్‌ పోలీ సులకు తెలిపారు.

మూడు రోజుల క్రితం ఖాద ర్‌బాగ్‌లో ఉంటున్న ఫరా (22)ను జహ నుమా ప్రాంతానికి చెందిన మహ్మద్‌ కిడ్నాప్ చేసుకువెళ్లాడని కుటుంబసభ్యులు లంగర్‌ హౌజ్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేస్తున్న పోలీసులకు వారు తాము వివాహం చేసుకున్నట్లు సమాచారం అందించారు. శుక్రవారం ఉదయం నుంచి పోలీస్‌ స్టేషన్‌కు వస్తున్నామని తెలిపి తర్వాత మేం మేజర్‌ కాబట్టి వివాహం చేసుకున్నామని పోలీస్‌స్టేషన్‌కు రావడం లేదని సమాచారం అందించినట్లు తెలిసింది.

పుట్టెంట్రుకలు తీద్దామని వెళ్లి..

ఇదిలావుంటే, మరో కొద్ది గంటల్లో తిరుమల కొండ ఎక్కాల్సిన కుటుంబం అనంతలోకాలకు వెళ్లింది. పుట్టెంట్రుకలు భగవంతుడికి సమర్పించాల్సిన వారు తిరిగిరాని లోకాలకు చేరుకున్నారు. తిరుపతికి సమీపాన ఉన్న మామండూరు వద్ద ఎదురుగా వస్తున్న లారీ ఢీకొనడంతో అత్తాపూర్‌కు చెందిన కుటుంబం అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యింది.

కమల్‌బాయ్‌ విష్ణువర్థన్‌రెడ్డి మహబూబ్‌నగర్‌ జిల్లా దామరగిద్ద మండలం మద్దెలబీడు గ్రామం వాసి. ఆయన మలక్‌పేటలోని మిదాస్‌ సుజుకి షోరూంలో సేల్స్‌ మేనేజర్‌గా పనిచేస్తున్నారు. తన ఎనిమిది నెలల కుమార్తె ధన్యకు పుట్టెంట్రుకలు తీయించడానికి కొద్దిరోజుల క్రితం తిరుమల వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఆయనతో పాటు భార్య కవిత, తండ్రి దయానందరెడ్డి, తల్లి ప్రమీలను తీసుకెళ్లాలను కున్నాడు.

 MBBS girl student marries her lover

మహబూబ్‌నగర్‌ జిల్లాలో ఉంటున్న తల్లిదండ్రులు తిరుమల వెళ్లడం కోసం కుమారుడు విష్ణువర్థన్‌రెడ్డి వద్దకు కొద్దిరోజుల క్రితం వచ్చారు. వీరంతా కలిసి కారులో తిరుమలకు బయలు దేరారు. అప్పటి వరకు వారి ప్రయాణం సరదాగా సాగింది. తిరుమల కొండపై ఏయే ప్రదేశాలు సందర్శించాలో మాట్లాడుకుంటున్నారు. కొండపై అన్ని ప్రసిద్ధ ప్రాంతాలను చూసి తీరాలని అనుకున్నారు. ఇంతలోనే భారీ లారీ మృత్యువు రూపంలో ఆ కుటుంబాన్ని కాటేసింది. విష్ణువర్థన్‌ రెడ్డితో పాటు అందరూ అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు.

దీంతో అత్తాపూర్‌లోనూ, మద్దెలబీడు గ్రామంలోనూ విషాదఛాయలు అలముకున్నాయి. విష్ణువర్థన్‌రెడ్డి భార్య కవిత హైటెక్‌సిటీలోని యునైటెడ్‌ ఇండియా ఇన్సూరెన్స్‌ కంపెనీలో పని చేస్తుంది. మొదట్లో ఈ కుటుంబం కర్మన్‌ఘాట్‌లో నివాసముండేది. కవితకు ఇన్సూరెన్స్‌ కంపెనీలో ఉద్యోగం రావడంతో అత్తాపూర్‌కు మారారు. ప్రమాదం విషయం తెలియగానే సుజుకీ షోరూం లోని తోటి ఉద్యోగులు కంటతడి పెట్టారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+