ఫిబ్ర‌వరి 21నుంచి నాలుగురోజుల‌పాటు జ‌ర‌గ‌నున్న మేడారం జాత‌ర..

దేశంలోనే ప్ర‌సిద్ధిచెందింది మేడారం జాత‌ర‌. ఈ జాత‌ర తెలంగాణ‌లోని జ‌యశంక‌ర్ భూపాల‌ప‌ల్లి జిల్లాలో జ‌రుగుతోంది. ఇది ఒక ఆదివాసీ గిరిజ‌న జాత‌ర‌. ఈ జాత‌ర‌ను నాలుగురోజుల‌పాటు ఎంతో వైభ‌వంగా నిర్వ‌హిస్తారు. కేవ‌లం తెలంగాణ నుంచి మాత్ర‌మే కాకుండా ఈ జాత‌ర‌ను చూసేందుకు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌తోపాటు ఛ‌త్తీస్‌ఘ‌డ్‌, మ‌హారాష్ట్ర‌, జార్ఖండ్ రాష్ట్రాల నుంచి కూడా భ‌క్తులు త‌ర‌లివ‌స్తారు. ఈ జాత‌ర ప్ర‌తి రెండేళ్ల‌కొక‌సారి ఎంతో వైభ‌వంగా జ‌రుగుతోంది.

వచ్చే ఏడాది ఫిబ్రవరి 21 నుంచి 24 వరకు ఈ జాతర జరగనుంది. ఈ జాత‌ర‌కు కోటిన్నర మందికి పైగా భక్తులు తరలివచ్చే అవకాశముంద‌ని అంచ‌నా వేస్తున్నారు. ఇప్ప‌టికే ఈ జాతర కోసం రూ.75 కోట్లతో 21 శాఖల అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్ర‌భుత్వానికి పంపారు. అయితే, ఎన్నిక‌ల నేప‌థ్యంలో అవి అమోదం కాలేద‌ని తెలుస్తోంది. అయితే, తాజాగా రాష్ట్రప్ర‌భుత్వం ఈ జాతర కోసం రూ.75 కోట్ల విడుదలకు ఆమోదం తెలిపింది. దీంతో ఈ జాత‌ర ప‌నులు షూరు అయ్యాయి.

Medaram Jatara will be held for four days from February 21.

ఫిబ్ర‌వ‌రి 14న మాఘ‌శుద్ధ పంచ‌మి నుంచి ప్రారంభం : ఈ జాత‌రలో భాగంగా ఫిబ్రవరి 14న మాఘశుద్ధ పంచమి రోజున మండె మెలిగె, గుడి శుద్ధీకరణ క్రతువుతో జాతరను ప్రారంభం చేయ‌నున్నారు. నాలుగురోజుల‌పాటు జ‌రిగే ఈ జాత‌ర‌తో చుటుప‌క్క‌ల ప్రాంతాల‌న్నీ ఎంతో కోల‌హాలాంగా మార‌తాయి. ముందుగా భ‌క్తులంతా జంప‌న్న‌వాగులో స్నానాలాచ‌రించి దేవ‌తామూర్తుల‌ను దర్శించుకుని వారికి బంగారుకానుక‌లు స‌మ‌ర్పిస్తారు. మేడారం జాతరలో మొదటిరోజు కన్నెపల్లి ప్రాంతం నుంచి సారలమ్మను గద్దె పైకి తీసుకువస్తారు. ఆ తర్వాత‌ రోజు చిలకలగుట్ట దగ్గర ఉన్న సమ్మక్కను తీసుకువచ్చి గద్దెపై ప్రతిష్టిస్తారు. మూడో రోజు భక్తులు గిరిజన తల్లులు సమ్మక్క సారలమ్మను కొలుస్తారు. నాలుగు రోజు అమ్మవార్లు తిరిగి వన ప్రవేశం చేస్తారు.

మేడారం జాతరకు కనీసం 6 నెలల ముందునుంచే ఏర్పాట్లు చేయాల్సి ఉన్నా, ఎన్నికల నేప‌థ్యంగా ఆలస్యమైంది. దీంతో ఇక్క‌డ చేయాల్సిన ప‌నులు చాలానే ఉన్నాయి. అందులో ముఖ్యంగా మంచినీటి స‌దుపాయ‌, ర‌హ‌దారులు, 24 గంట‌ల విద్యుత్ స‌ర‌ఫ‌రాకు ఎటువంటి ఆటంకం లేకుండా చేయాలి. ఈ రెండు నెల‌ల స‌మ‌యంలోనే ఈ ప‌నుల‌న్నీంటిని పూర్తిచేయాల్సి ఉంటుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+