సుబ్బరాజు ఇంటి వద్ద ఉద్రిక్తత: మీడియాను అడ్డుకుని.. సెక్యూరిటీ వాగ్వాదం..
కవరేజీ కోసం వెళ్లిన మీడియా సిబ్బందిని సుబ్బరాజు ఇంటి వద్ద ఉన్న సెక్యూరిటీ అడ్డుకున్నారు.
హైదరాబాద్: టాలీవుడ్ డ్రగ్స్ రాకెట్ కేసులో నేడు నటుడు సుబ్బరాజును సిట్ అధికారులు విచారిస్తున్నారు. ఈ మేరకు గురువారం ఉదయం 10గం.కు సుబ్బరాజు ఎక్సైజ్ కార్యాలయానికి వచ్చారు. అయితే సుబ్బరాజు ఇంటి నుంచి బయలుదేరే సమయంలో ఆయన నివాసం వద్ద ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకుంది.
కవరేజీ కోసం వెళ్లిన మీడియా సిబ్బందిని సుబ్బరాజు ఇంటి వద్ద ఉన్న సెక్యూరిటీ అడ్డుకున్నారు. దీంతో సెక్యూరిటీకి, మీడియాకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అనంతరం సుబ్బరాజు తన వాహనంలో ఎక్సైజ్ కార్యాలయానికి బయలుదేరి వెళ్లారు. ఆ సమయంలో మీడియాతో మాట్లాడటానికి ఆయన విముఖత వ్యక్తం చేశారు.

సిట్ విచారణ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడే అవకాశం ఉంది. కాగా, విచారణలో కెల్విన్ తో సంబంధాలు, అతనితో చాటింగ్ వంటి విషయాల పైనే సిట్ కీలకంగా ప్రశ్నించనున్నట్లు సమాచారం. ఇదే కేసుకు సంబంధించి గురువారం శ్యాంకె నాయుడు, బుధవారం పూరి జగన్నాథ్ సైతం విచారణను ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. పూరిని అగస్టు నెలలో మరోసారి విచారించే అవకాశం ఉంది.
-
AP SSC & Inter Results 2026: టెన్త్, ఇంటర్ ఫలితాలు అప్పుడే-తేదీలు ఫిక్స్ ! -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
గ్యాస్ సంక్షోభం వేళ కేంద్రం గుడ్ న్యూస్.. వెంటనే ఇలా చేయండి.. -
Jobs: లక్షల్లో జీతం.. గెజిటెడ్ హోదా! డిగ్రీ ఉంటే చాలు.. -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
today rashiphalalu: నేడు వీరికి సంపదలు ఇవ్వనున్న సూర్యుడు, లక్కంటే వీరిదే! -
డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో తెలంగాణ రవాణా శాఖ సరికొత్త నిర్ణయం! -
షూటింగ్ లో ఉన్న ఇండియాలోనే అత్యంత ఖరీదైన టాప్-5 చిత్రాలు -
ఆ పిచ్చోడిని ఆపండి-గల్ఫ్ అగ్నిగోళం కాకముందే-ఐఏఈఏ మాజీ బాస్ పిలుపు..! -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ!












Click it and Unblock the Notifications