వైద్య విద్యార్థిని ఆత్మహత్య: భర్తతో గొడవలే కారణమా?

హైదరాబాద్: హైదరాబాద్ ఉప్పల్ పరిధిలోని మేడిపల్లి పి అండ్ కాలనీలో నివాసం ఉంటున్న భవానీ శ్ర22) అనే వివాహిత ోసమవారం రాత్రి ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కొన్ని రోజులుగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నట్లుగా సమాచారాం. దీంతోనే ఆమె మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నట్లు అనుమానిస్తున్నారు.

సోమవారం రాత్రి అందరూ నిద్రపోతున్న సమయంలో ఉరి వేసుకుని ఆమె మరణించింది. వరంగల్ జిల్లాకు చెందిన భవాని అదే జిల్లాకు చెందిన దోమల పృథ్వీరాజ్‌ను నిరుడు వివాహం చేసుకుంది. భవాని హైదరాబాదులోని ఓ వైద్య కళాశాలలో చదువుతోంది. కేసు నమోదు చేసుకున్న మేడిపల్లి పోలీసులు దర్యాప్తు సాగిస్తున్నారు.

 Medical girl student commits suicide

విద్యార్థి ఆత్మహత్యాయత్నం

పాఠశాలకు వెళ్లలేదని తల్లిదండ్రులు మందలించడంతో ఓ విద్యార్థి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన ఖమ్మం జిల్లా బయ్యారం మండలంలోని ఇసుకమీదికి గ్రామంలో మంగళవారం చోటు చేసుకుంది. బయ్యారంలోని ఓ పాఠశాలలో సంతోష్ 9వ తరగతి చదువుతున్నాడు.

గత కొన్ని రోజులుగా అతను బడికి వెళ్లడం లేదు. దీంతో తల్లిదండ్రులు మందలించారు. దీంతో మనస్తాపానికి గురైన సంతోష్ పురుగులు మందు తాగి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించాడు. ఇది గమనించిన తల్లిదండ్రులు అతనిడి హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.

మహిళ దారుణ హత్య

మద్యం మత్తులో ఓ వ్యక్తి మహిళను హత్య చేశాడు. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా వేములవాడలోని అయ్యోరిపల్లిలో సోమవారం అర్థరాత్రి చోటు చేసుకుంది. అయ్యోరిపల్లికి చెందిన గుజరాతీ రాంభాయ్ (50) అనే మహిళ సంచార జీవితం గడిపేది.

సోమవారం అర్ధరాత్రి చంద్రయ్య అనే వ్యక్తితో రాంబాయ్ గొడవ పడింది. తాగిన మైకంలో ఉన్న చంద్రయ్య ఆమెను హత్య చేశాడు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని హత్యపై ఆరా తీశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+