మిస్టర్ వరల్డ్‌గా హైదరాబాదీ: చరిత్ర సృష్టించిన రోహిత్

Posted By:
Subscribe to Oneindia Telugu

లండన్: మిస్టర్ వరల్డ్ 2016గా హైదరాబాద్‌కు చెందిన యువకుడు రోహిత్ ఖండేల్‌వాల్ ఎంపికయ్యాడు. మిస్టర్ వరల్డ్ ఛాంపియన్ షిప్‌ను గెలిచిన తొలి భారతీయుడిగా చరిత్ర సృష్టించాడు. జులై 19న ఇంగ్లాండ్‌లోని సౌత్‌పోర్ట్‌లో జరిగిన మిస్ వరల్డ్ ఫైనల్స్‌లో మొత్తం 46 మంది అభ్యర్ధులు పోటీ పడ్డారు.

'మిస్టర్ ఇండియా'గా హైదరాబాద్ యువకుడు..!

ఈ పోటీలో అందరినీ వెనక్కి నెట్టిన రోహిత్ 'మిస్టర్ వరల్డ్‌'గా ఎంపికయ్యాడు. ఈ టైటిల్‌తో పాటు రోహిత్ 50 వేల డాలర్ల (దాదాపు రూ.35 లక్షలు)ను ప్రైజ్‌మనీగా బహుమతిగా అందుకున్నాడు. పోటీలు ముగిసిన వెంటనే 'మిస్టర్ వరల్డ్- 2016' నిర్వాహకులు తమ అఫీషియల్ ట్విట్టర్ ఖాతాలో రోహిత్ విజయాన్ని ప్రకటించారు.

Humbled to be the first Asian , Indian to win Mr.world 2016 . Thanks for all the love 😘😘 With @mrworld2014

A photo posted by Rohit Khandelwal (@rohit_khandelwal77) on Jul 19, 2016 at 7:25pm PDT

And we are all set for our first performance on the stage #mrworld2016

A photo posted by Rohit Khandelwal (@rohit_khandelwal77) on Jul 19, 2016 at 9:32am PDT

"We are not perfect , we are learning . That's the beauty in our specific journey " with mr Korea and mr Brazil

A photo posted by Rohit Khandelwal (@rohit_khandelwal77) on Jul 17, 2016 at 7:37am PDT

Together we are one , One family , Brotherhood at Mr.world #mrworlddiaries

A photo posted by Rohit Khandelwal (@rohit_khandelwal77) on Jul 17, 2016 at 4:32am PDT

At the Golf court #southport #mrworld #mrindia #golf #greenteam

A photo posted by Rohit Khandelwal (@rohit_khandelwal77) on Jul 13, 2016 at 10:03pm PDT

Love for dogs 😍 This cutie on the streets of beautiful southport 🤗 With @amilomoxie

A photo posted by Rohit Khandelwal (@rohit_khandelwal77) on Jul 15, 2016 at 11:49am PDT

మిస్టర్ వరల్డ్ టైటిల్‌తో పాటు వరల్డ్ మల్టీమీడియా అవార్డు, ప్రపంచ టాలెంట్‌, మాబ్‌స్టార్‌ పీపుల్స్‌ ఛాయిస్‌ లాంటి సబ్‌ టైటిళ్లకు కూడా రోహిత్‌ పోటీ పడ్డాడు. టైటిల్‌ను గెలిచిన అనంతరం మిస్టర్ వరల్డ్ 2014 నిక్లాస్ పీడరెన్స్‌తో కలిసి దిగిన ఫోటోను రోహిత్ తన ఇన్‌స్టాగ్రాంలో పోస్టు చేశాడు.

కాగా, గతేడాది ముంబైలో ప్రోవోగ్ పర్సనల్ కేర్ నిర్వహించిన పోటీల్లో రోహిత్ ఖండేల్‌వాల్ 'మిస్టర్ ఇండియా-2015' టైటిల్ గెలుచుకున్నాడు. ఈ విజయంతోనే రోహిత్ మిస్టర్ వరల్డ్ పోటీల్లో భారతదేశానికి ప్రాతనిధ్యం వహించాడు. మోడలింగ్ రంగంలో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు చేస్తున్న ఉద్యోగాన్ని సైతం వదిలేసి ఓ సాధారణ యువకుడిగా రోహిత్ ముంబైలో అడుగుపెట్టాడు.

మార్వాడీ కుటుంబానికి చెందిన రోహిత్ పుట్టంది, పెరిగింది చదివింది అంతా హైదరాబాద్‌లోనే కావడం విశేషం. మోడలింగ్ రంగంలోకి ప్రవేశించక ముందు స్పెస్ జెట్ ఎయిర్ లైన్స్, డెల్ ఇంటర్నేషనల్‌లో రోహిత్ పనిచేశాడు. బిందాస్ ఛానల్‌లో 'యే హై ఆషికీ' ఎపిసోడ్‌లో కూడా నటించాడు. దీంతో పాటు బీ ఛానెల్‌లో ప్రసారమవుతున్న 'మిలియన్ డాలర్ గర్ల్' సీరియల్‌లో ముఖ్యమైన పాత్రను పోషించాడు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Model and actor Rohit Khandelwal, 26, has become the first Indian - in fact, the first Asian - to have won the Mr World beauty pageant. Rohit competed with 46 contestants and was awarded the title at the grand finale held in Southport, UK on July 19.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

X