నాగార్జునకు షాక్..రేవంత్ రెడ్డి చేసింది తప్పు కాదు..మెగా బ్రదర్ సంచలన ట్వీట్

హైదరాబాద్‌లో హైడ్రా సంచలనం సృష్టిస్తోన్న సంగతి తెలిసిందే. అక్రమంగా కట్టిన ఇళ్లపై హైడ్రా తన ప్రతాపం చూపిస్తోంది. హైడ్రా దెబ్బకు అక్రమార్కులు వణికిపోతున్నారు. గతంలో బల్డియా, హెచ్‌ఎండీఏ ఇతర మున్సిపాలిటీల పరిధిలో దరఖాస్తులను పరిశీలించి పరిష్కరించేవారు. ఎఫ్‌టీఎల్, బఫర్‌ జోన్లను పెద్దగా పట్టించుకునే వారు కాదు. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. చెరువు సమీపంలో ఉన్న వాటిని తిరస్కరిస్తున్నారు. హైడ్రా కొరడా ఝుళిపిస్తుండటంతో ఎల్‌ఆర్‌ఎస్‌ ప్రక్రియలో నీటిపారుదల, రెవెన్యూ శాఖలను కూడా భాగస్వామ్యం చేశారు.

మరోవైపు హైడ్రా సెలబ్రిటీలను సైతం వదిలిపెట్టడం లేదు. హీరో నాగార్జునకు సైతం హైడ్రా భారీ షాక్ ఇచ్చింది. మాదాపూర్‌లోని తుమ్మిడికుంట చెరువును కబ్జా చేసి నాగార్జున ఎన్‌ కన్వెన్షన్‌ హాల్‌ను నిర్మించారనేఆరోపణలు వచ్చాయి. ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన హైడ్రాకు ఈ నిర్మాణంపైనా ఫిర్యాదుల వచ్చాయి. ఎన్ కన్వెన్షన్‌ను తాకుతూనే చెరువు నీళ్లు ఉంటాయి. దీంతో, ఈ నిర్మాణంకు సంబంధించి హైడ్రా పూర్తి వివరాలు సేకరించింది. తుమ్మిడి చెరువులో 3 ఎకరాల 30 గుంటలను ఆక్రమించి ఎన్ కన్వెన్షన్ సెంటర్‌ను నిర్మించారని హైడ్రా గుర్తించింది. దీంతో అక్రమ కట్టడం క్రింద ఆ భవనాన్ని కూల్చివేయడం జరిగింది.

mega brother nagababu support to hydra

ఇదిలా ఉంటే హైడ్రాపై మెగా బ్రదర్ నాగబాబు ట్విట్టర్ వేదికగా స్పందించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ సందర్భంగా హైడ్రాను ఉద్దేశించి నాగబాబు చేసిన ట్వీట్ ఇప్పుడు సంచలనంగా మారింది. వర్షాలకు తూములు తెగిపోయి, చెరువులు, నాళాలు ఉప్పొంగిపోయి అపార్ట్మెంట్లలోకి కూడా నీళ్లు రావడం మనం చూస్తున్నాం.

దీనికి ప్రజలు ప్రాణాలు కోల్పోవడం బాధాకరం. వీటికి ముఖ్య కారణం చెరువులను ఆక్రమించి నిర్మాణాలు చేయడమే అని ట్వీట్ చేశారు. దీనికి నివారణగా సీఎం రేవంత్ ధైర్యంగా హైడ్రా కాన్సెప్ట్ తీసుకొచ్చారు. దీనికి అందరూ సపోర్ట్ చేయాలి అని ట్వీట్ చేశారు. ఇప్పటికైనా అర్థ అయ్యిందా సీఎం రేవంత్ రెడ్డి తీసుకువచ్చిన హైడ్రా చేస్తున్న పని మంచిదే అన్నారు.నాగార్జున ఎన్‌ కన్వెన్షన్‌ హాల్‌ను కూల్చిన సమయంలో నాగబాబు సోషల్ మీడియాలో రేవంత్ రెడ్డికి మద్దతు తెలపడం ఇప్పుడు సంచలనంగా మారింది. దీనిపై అక్కినేని అభిమానులు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+