be the real man:ఎన్టీఆర్ ఛాలెంజ్ పూర్తిచేసిన చిరు, దోశ వేసి.. కేటీఆర్, రజనీకాంత్ నామినేట్..
తెలుగు సినిమా ఇండస్ట్రీలో 'బీ ది రియల్ మెన్' ఛాలెంజ్ నడుస్తోంది. లాక్ డౌన్ సందర్భంగా ఖాళీగా ఉంటోన్న సినీ ప్రముఖులు పనిచేస్తూ ఛాలెంజ్ విసురుతున్నారు. అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ వంగా ఛాలెంజ్ ప్రారంభించి.. రాజమౌళిని నామినేట్ చేయడంతో ప్రారంభమైంది. మెగాస్టార్ చిరంజీవి తన ఛాలెంజ్‌ను పూర్తి చేశారు.
Recommended Video

దోశ వేసి..
జూనియర్ ఎన్టీఆర్ వేసిన ‘బీ ది రియల్ మెన్' ఛాలెంజ్‌ను మెగాస్టార్ చిరంజీవి స్వీకరించారు. లాక్‌డౌన్ సందర్భంగా ఇంట్లో దోశలు వేసిన వీడియోను ఆయన షేర్ చేశారు. పెనం మీద దోశ వేసి, మసాలా వేయించి వేశారు మెగాస్టార్ చిరంజీవి. దోశను పైకి ఎగరేస్తున్న విజువల్ చక్కగా కనిపించింది. ఆ దోశను తన తల్లి అంజనాదేవి వద్దకు తీసుకెళ్లారు. కానీ ఆ తల్లి కుమారుడికి తినిపించి.. తాను ఆరగించారు. అంతకుముందు ఇంట్లో వాక్యూమ్ క్లీనర్‌తో ఇంటిని కూడా వీడియో తీశారు. మెగాస్టార్ చిరంజీవి దీనిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ వీడియో ఇప్పుడు తెగ వైరలవుతోంది.

కేటీఆర్, రజనీకాంత్..
బీ ద రియల్ మెన్ ఛాలెంజ్ స్వీకరించి ఇంట్లో పనిచేసిన చిరంజీవి.. తర్వాత మంత్రి కేటీఆర్, తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్‌ను నామినేట్ చేశారు. చిరంజీవి ఛాలెంజ్‌ను వారిద్దరూ స్వీకరించాల్సి ఉంది. ఈ ఛాలెంజ్‌ను దర్శకుడు సందీప్ రెడ్డి ప్రారంభించారు. తొలుత రాజమౌళిని నామినేట్ చేయగా.. ఆయన ఎన్టీఆర్, రామ్‌చరణ్‌ను నామినేట్ చేసిన సంగతి తెలిసిందే.

ఏ పనులు చేశారంటే..
ఎన్టీఆర్ చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జునతోపాటు డైరెక్టర్ కొరటాల శివను కూడా ఎన్టీఆర్ నాటినేట్ చేశారు. వీరిలో తొలుత చిరంజీవి ఛాలెంజ్ స్వీకరించి.. ఇంట్లో పనులు చేశారు. ఛాలెంజ్‌లో భాగంగా రాజమౌళి ఇల్లు శుభ్రం చేసి, కడిగారు. ఎన్టీఆర్ ఇంటి పనులు చేశారు. రాంచరణ్ చెట్లకు నీరు పోశారు. బట్టలను వాషింగ్ మిషన్‌లో వేయడంతోపాటు తన భార్య ఉపాసనకు కాఫీ కలిపి ఇచ్చాడు. దర్శకుడు కొరటాల శివ కూడా ఇంట్లో పనులు చేశారు. బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్.. ఛాలెంజ్ స్వీకరించి పూర్తి చేయాల్సి ఉంది.
-
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
విజయ్- త్రిష పెళ్లికి త్రిష తల్లి గ్రీన్ సిగ్నల్..? -
West Bengal Survey: బెంగాల్లో అనూహ్య ఫలితాలు?-తేల్చేసిన మ్యాట్రిజ్ సర్వే..! -
LPG కొరతకు చెక్.. భారత్ మార్కెట్ లోకి DME Fuel !! -
ఏప్రిల్ నెలలో మేషరాశి, వృషభ రాశి జాతక ఫలం -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్ -
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
మాస్కోలోని పుతిన్ నివాసంలో తలదాచుకున్న ఇరాన్ సుప్రీం లీడర్..?? -
బంగారం ధరలకు పూర్వవైభవం- పరుగులు -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్!












Click it and Unblock the Notifications