భయం కలిగేలా..నడిరోడ్డు మీద ఉరి తీయాలి..: చిరంజీవి

Recommended Video

    Mega Star Chiranjeevi Emotional On Disha Issue || Oneindia Telugu

    హైదరాబాద్: రెండు మూడు రోజులుగా ఆడపిల్లలపై జరుగుతున్న అత్యాచారాలు, హత్యలు చూస్తుంటే గుండె తరుక్కుపోతోంది. ఈ దేశంలో ఆడపిల్లలకు భద్రత లేదనే భావం కలుగుతోంది. మగ మృగాల మధ్యా మనం బతుకుతోంది అనిపిస్తోంది. మనసు కలిచివేసిన ఈ సంఘటనల గురించి ఒక అన్నగా, ఒక తండ్రిగా స్పందిస్తున్నాను. ఇలాంటి నేరాలు చేసిన దుర్మార్గులకు శిక్షలు చాలా కఠినంగా ఉండాలి. భయం కలిగించేలా ఉండాలి. నడిరోడ్డుపై ఉరితీసినా తప్పులేదు.. అని మెగాస్టార్ చిరంజీవి అన్నారు.

    ప్రియాంకా రెడ్డి హత్యపై చిరు ఆవేదన..

    దేశవ్యాప్తంగా ప్రకంపనలను పుట్టిస్తోన్న వెటర్నరీ డాక్టర్ ప్రియాంకా రెడ్డి అత్యాచారం, హత్యోదంతంపై చిరంజీవి స్పందించారు. 45 సెకెన్ల నిడివి ఉన్న ఓ వీడియోను ఆయన విడుదల చేశారు. సంఘటన చోటు చేసుకున్న కొన్ని గంటల వ్యవధిలోనే నేరస్థులను పట్టుకోవడం పట్ల ఆయన పోలీసులకు అభినందనలు తెలియజేశారు. వారిని పట్టుకోవడంతో సరిపోదని, త్వరితగతిన శిక్ష పడేలా చూడాలని అన్నారు. అప్పుడే ఇలాంటి నేరాలు చేయాలంటే ఎవడైనా భయపడతాడని చెప్పారు.

    మీ ఫోన్ లో 100 నంబర్ ను సేవ్ చేసుకోండి..

    మీ ఫోన్ లో 100 నంబర్ ను సేవ్ చేసుకోండి..

    అమ్మాయిలందరూ తమ ఫోన్ లో డయల్ 100 నంబర్ ను సేవ్ చేసి పెట్టుకోవాలని ఈ సందర్భంగా చిరంజీవి సూచించారు. ఆడపిల్లలందరికీ తాను ఓ అన్నగా, తండ్రిగా చెబుతున్నానని, ఫోన్ లో 100 నంబర్ ను సేవ్ చేసుకోవాలని అన్నారు. స్మార్ట్ ఫోన్లలో ‘హాక్ ఐ' యాప్‌ను ఇన్ స్టాల్ చేసుకోవాలని చెప్పారు. ఒక్క బజర్ నొక్కితే చాలు.. షీ టీమ్స్ హుటాహుటిన మీ దగ్గరకు చేరుకుంటాయని చిరంజీవి చెప్పారు.

    సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలంటూ..

    సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలంటూ..

    పోలీసు శాఖ అధికారులు ప్రవేశ పెట్టిన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలని, వారి సేవలను పొందాలని అన్నారు. మహిళలకు రక్షణ కల్పించడం, వారిని గౌరవించడం ఈ సమాజంలో జీవించే ప్రతి ఒక్కరి బాధ్యత అని ఆయన చెప్పారు. ఆడపిల్లలు ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తే.. వారి కోసం షీ టీమ్స్ అందుబాటులో ఉన్న విషయాన్ని ఏ ఒక్కరూ మరిచిపోకూడదని అన్నారు. ప్రియాంకా రెడ్డి హత్యోదంతం ఆయనను ఎంతగా కదిలించి వేసిందోననడానికి ఈ వీడియోను సాక్ష్యంగా చెబుతున్నారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+