Shah Rukh Khan: హైదరాబాద్‌పై షారుక్ ఖాన్ ట్వీట్ వైరల్: ‘టోలీచౌకీ’లో బాల్యం ఇలా!

హైదరాబాద్: బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్ నటించిన 'జవాన్' సినిమా విడుదలైన సందర్భంగా హైదరాబాద్ నగరంపై ఆయన చేసిన ట్వీట్ వైరల్‌గా మారింది. అయితే, హైదరాబాద్ నగరంతో షారుక్‌కు చిన్ననాటి నుంచి మంచి అనుబంధం ఉంది. ఈ క్రమంలోనే హైదరాబాద్ నగరంపై తనకున్న అభిమానాన్ని ఎప్పుడూ బహిరంగంగానే చాటుకుంటారు.

అయిేత, షారుఖ్ తల్లి లతీఫ్ ఫాతిమా ఖాన్ హైదరాబాద్‌కు చెందినవారు. ఆమె ఇక్కడ అంకితభావంతో సామాజిక కార్యకర్త. ఇంకా, ఫాతిమా హైదరాబాద్‌లోని ఒక సీనియర్ ప్రభుత్వ ఇంజనీర్ కుమార్తె. నగరానికి ఉన్న ఈ ప్రత్యేక సంబంధం షారుఖ్ ఖాన్ తనను తాను "సగం హైదరాబాదీ" అని ఆప్యాయంగా చెప్పుకునేలా చేసింది.

Memories of in child: Shah Rukh Khan’s tweet on Tolichowki, Hyderabad goes viral

ఇప్పుడు, షారుక్.. హైదరాబాద్‌లో తన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ చేసిన ట్వీట్ ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. ప్రఖ్యాత చార్మినార్‌ను సందర్శించి, ఇంట్లో రుచికరమైన హైదరాబాదీ వంటకాలను ఆస్వాదించడాన్ని షారుక్ ప్రస్తావించారు. #AskSRK సెషన్‌లలో భాగంగా హైదరాబాద్‌కు చెందిన ఓ అభిమాని హైదరాబాద్‌లోని టోలీచౌకితో షారుక్‌కు ఉన్న అనుబంధంపై ప్రశ్నించాడు. మీకు ఏమైనా దీని గురించి గుర్తుందా? అని అడిగాడు.

దీనికి షారుక్ ఖాన్ బదులిస్తూ.. "బహుత్ చోటా థా యాద్ హై చార్ మినార్ జాతే ది అండ్ ఘర్ మే బహుత్ అచ్చా ఖానా హోతా థా. #జవాన్" అని పేర్కొన్నారు. దీంతో షారుఖ్ ఖాన్‌కు హైదరాబాద్‌పై ఉన్న ప్రేమ ఇప్పటికీ చాలా బలంగా ఉందని స్పష్టమైంది.

షారుక్ చిన్నతనంలో నాలుగేళ్లు టోలీచౌకిలోనే : గతంలో తన మీడియా ఇంటరాక్షన్‌లలో ఒకసారి హైదరాబాద్‌తో తనకు ఉన్న అనుబంధం గురించి మాట్లాడారు. 'అప్పట్లో వాళ్ల కుటుంబంలో అబ్బాయిలు లేనందున నన్ను మా అమ్మమ్మ దత్తత తీసుకుంది. కాబట్టి, నేను మా అమ్మకు పుట్టినప్పుడు వారు నన్ను దత్తత తీసుకున్నారు. వీరు హైదరాబాద్‌లోని టోలీచౌకిలో నివసించేవారు. నేను నా జీవితంలో దాదాపు 4 సంవత్సరాలు ఇక్కడే గడిపాను. తర్వాత బెంగుళూరుకు షిఫ్ట్ అయ్యాం. మా అమ్మ నన్ను మిస్సవుతున్న క్రమంలో .. ఆమె తన తల్లి నుంచి నన్ను వెనక్కి తీసుకుంది. ఆ తర్వాత మేము ఢిల్లీకి వెళ్లాము. మా అమ్మ ఇల్లు హైదరాబాద్‌లో ఉంది, మా అమ్మ కుటుంబం మొత్తం ఇక్కడే ఉంటుంది' అని షారుక్ వివరించారు.

Memories of in child: Shah Rukh Khan’s tweet on Tolichowki, Hyderabad goes viral

టోలిచౌకిలోనే షారుక్ గడిపిన ఇల్లు : కాగా, షారుఖ్ ఖాన్ ఇల్లు ప్రస్తుతం టోలిచౌకి ప్రధాన రహదారిపై ఉన్న 'మొఘల్ రెసిడెన్సీ' (ప్రాంతంలోని పురాతన అపార్ట్‌మెంట్లలో ఒకటి) ఉంది. అవును, మీరు చదివింది నిజమే! షారుక్ తల్లితండ్రులు ఇఫ్తికర్ అహ్మద్ అదే స్థలంలో 'హవేలీ' (భారీ భవనం) కలిగి ఉండేవారని, దానిని విక్రయించి, నగరంలోని కొంతమంది బిల్డర్లకు అప్పగించారని ఇందుకు సంబంధించిన వీడియోలో వెల్లడైంది. కాగా, ప్రస్తుతం షారుక్ ఖాన్ నటించిన జవాన్ సినిమా ప్రపంచ వ్యాప్తంగా గురువారం విడుదలైంది. మంచి టాక్ సొంతం చేసుకుంది. అట్లీ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో షారుక్ సరసన నయనతార నటించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+