హైదరాబాద్‌కు భారీ హెచ్చరిక..మరో రెండు గంటల్లో డేంజర్

తెలంగాణకు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ముఖ్యంగా హైదరాబాద్‌ను అతి భారీ వర్షాలు ముంచెత్తే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. తద్వారా పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. మరో ఆరు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది.తేలికపాటి నుంచి మోస్తరు లేదా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది.

ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వెల్లడించింది. ఇప్పటికే రెండు రోజులుగా పలు ప్రాంతాల్లో ఎడతెరిపిలేకుండా వర్షం కురుస్తోంది. దీంతో లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. డ్రైనేజీలు, వాగులు, వంకలు, కాలువలు పొంగిపొర్లుతున్నాయి. రోడ్లపై వర్షపు నీరు భారీగా నిలిచిపోయింది. దీంతో వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. ముఖ్యంగా హైదరాబాద్‌లో ఈ రోజు ఉదయం నుంచే వాన కురుస్తోంది.

Meteorological department has issued a huge warning for Hyderabad

మోస్తరు నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం పడుతోంది. ఈ నేపథ్యంలో భాగ్యనగర వాసులకు వాతావరణ శాఖ బిగ్ అలర్ట్ ప్రకటించింది. వచ్చే రెండు గంటల పాటు జంట నగరాల్లో అతి భారీ వర్షాలు పడతాయని హెచ్చరించింది. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని తెలిపింది. రానున్న రెండు గంటల్లో అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచించింది. ఇక ఏపీలోనూ వర్షాలు తమ ప్రతాపాన్ని చూపిస్తున్నాయి. గతంలో ఎప్పుడు లేని విధంగా రికార్డు స్థాయిలో విజయవాడలో వర్షాలు కురుకుస్తున్నాయి.

భారీ వర్షాలు కారణంగా విజయవాడలో కొన్ని ప్రాంతాలు జలమయం అయ్యాయి. విద్యాధరపురం, ఆర్ఆర్ నగర్, విజయవాడ సెంట్రల్ బస్ స్టాండ్, బెంజ్ సర్కిల్ ఫ్లైఓవర్ ప్రాంతాల్లో రహదారులు జలమయం అయ్యాయి. రోడ్లపైకి భారీగా నీరు చేరడంతో ట్రాఫిక్ కు తీవ్ర ఇబ్బందులు ఏర్పడ్డాయి. వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. రామవరప్పాడు రింగ్ రోడ్ నుంచి నిడమానూరు వరకు వాహనాలు నిలిచిపోయాయి. చాలా చోట్ల రోడ్లపై మోకాలి లోతు నీరు నిలిచింది. ఆర్టీసీ బస్ స్టేషన్ వద్ద బస్సులు నీటిలో ముందుకు కదల్లేక నిలిచిపోయాయి. మొగల్రాజపురం సున్నపుబట్టి సెంటర్ వద్ద కొండచరియలు విరిగిపడిన ఘటనలో నలుగురు మరణించారు. అమ్మవారి గుడి దగ్గర సైతం కొండచరియలు విరిగిపడ్డాయి. ఘాట్ రోడ్డు మూసివేయడంతో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+