Metro : హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు సంక్రాంతి పండుగ ఆఫర్..
సంక్రాంతి పండుగ సందర్భంగా మెట్రో అధికారులు హైదరబాద్ ప్రయాణికులకు ఓ శుభవార్తను మోసుకొచ్చారు. మెట్రో ప్రయాణికులకు బంఫర్ ఆఫర్‌ను ప్రకటించారు. సంక్రాంతి పండుగ కానుకగా మూడురోజులపాటు మెట్రోలో అపరిమితంగా ప్రయాణించే అవకాశాన్ని కల్పించింది. సూపర్ సేవర్ కార్డ్ ద్వారా 59 రూపాయల రీఛార్జ్‌తో మెట్రోలో ఎక్కడినుంచి ఎక్కడికైనా అపరిమితంగా ప్రయాణం చేయొచ్చు..
సంక్రాంతి పండుగ సందర్భంగా ఇప్పటికే భాగ్యనగరం బోసిపోయింది. ఉపాధి కోసం వలసవచ్చిన వారంతా వారి గ్రామాలకు వెళ్లిపోయారు. దీంతో హైదరాబాద్ నగరం నిర్మానుష్యంగా మారిపోయింది. మెున్నటి వరకు నిత్యం ప్రయాణికులతో కిటికిటలాడే మెట్రో, సిటీ బస్సులు ప్రయాణికులు లేక బోసిపోయాయి. ఈ క్రమంలో హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు ఓ గుడ్ న్యూస్ చెప్పింది. సూపర్ సేవర్ కార్డు ద్వారా పండుగ మూడురోజులు అపరిమితంగా ప్రయాణించే అవకాశాన్ని కల్పించింది. ఈ సూపర్ సేవర్ కార్డు కేవలం హాలిడే సమయాల్లో మాత్రమే వర్తిస్తుంది. ఈ నెల 13,14,15 తేదీల్లో మాత్రమే ఈ కార్డు ద్వారా ప్రయాణించగలరు.

59 రూపాయలు రీఛార్జ్‌తో అపరిమిత ప్రయాణం...
ఈ కార్డుతో రెండురోజులు 59 రూపాయలు రీఛార్జ్ చేసుకుని అపరిమితంగా ప్రయాణం చేయవచ్చు. మెట్రో స్టేషన్లలోని కౌంటర్ల వద్ద ఈ కార్డు లభిస్తుంది. కొత్తగా కార్డు తీసుకునే వారు 109 రూపాయలు చెల్లించి కార్డు తీసుకోవాల్సి ఉంటుంది. కార్డు ఉన్నవారు 59 రూపాయలతో రీఛార్జ్ చేస్తే సరిపోతుంది. మరెందుకాలస్యం సొంత వెహికల్స్, ప్రయివేటు వెహికల్స్‌లో ప్రయాణించేవారు ఈ రెండు రోజులు మెట్రో ఆఫర్‌ను ఉపయోగించుకోండి.












Click it and Unblock the Notifications