తెలంగాణ ఎమ్మెల్యేకు అర్ధరాత్రి న్యూడ్ వీడియో కాల్
ఇటీవల కాలంలో ఆన్‌లైన్, సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి కొందరైతే న్యూడ్ వీడియో కాల్స్ చేసి.. ఆ స్క్రీన్ షాట్లు తీసుకుని బెదిరించి డబ్బులు చేయడం లాంటి చేస్తున్నారు. ప్రముఖులు, సంపన్నులను టార్గెట్ చేసుకుని ఇలాంటి నేరాలకు పాల్పడుతున్నారు. తాజాగా, తెలంగాణకు చెందిన ఏకంగా ఓ ఎమ్మెల్యేకు న్యూడ్ కాల్ రావడం గమనార్హం. దీంతో ఆయన బెంబేలెత్తిపోయి సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించారు.
అక్టోబర్ 14న ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యేకు అర్ధరాత్రి దాటిన తర్వాత ఓ వీడియో కాల్ వచ్చింది. గుర్తు తెలియని నెంబర్ నుంచి వచ్చిన ఆ వీడియో కాల్‌ను ఎమ్మెల్యే ఆన్సర్ చేశారు. ఆ వెంటనే ఫోన్ స్క్రీన్‌పై మహిళ నగ్నంగా కనిపించింది. ఊహించని పరిణామంతో ఆందోళనకు గురైన ఎమ్మెల్యే వెంటనే ఆ వీడియో కాల్‌ను కట్ చేశారు. అయితే, తనపై కుట్ర పన్నేందుకు ఎవరైనా అలా న్యూడ్ వీడియో కాల్ చేయించారా? లేక నిజంగానే గుర్తు తెలియని వ్యక్తులే ఇలా చేసి ఉంటారా? అనే అనుమానం ఎమ్మెల్యేకు కలిగింది.

ఇలా వీడియో కాల్ చేసి తన ప్రతిష్టను దిగజార్చడంతోపాటు బ్లాక్‌మెయిల్ చేసే ఉద్దేశంతో ఎవరైనా ఈ పనికి పాల్పడి ఉంటారా? అనే అనుమానాల మధ్య ఆ ఎమ్మెల్యే నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్‌కు ఫిర్యాదు చేశారు. దీంతోపాటు గురువారం తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరోలోనూ లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఎమ్మెల్యేకు న్యూడ్ కాల్ వచ్చిన ఫోన్ నెంబర్ ఎవరిదనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు.
కాగా, గత కొంత కాలంగా ఇలాంటి కేసులు పెరుగుతున్న విషయం తెలిసిందే. న్యూడ్ కాల్స్ చేస్తూ.. వాటిని రికార్డ్ చేసి ఆ వ్యక్తుల నుంచి డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. మరికొందరు పోలీసులు, ఐటీ, ఈడీ అధికారులమంటూ ఫోన్లు చేసి సంపన్నుల నుంచి డబ్బులు కాజేస్తున్నారు. మరికొందరైతే మీ పిల్లలు డ్రగ్స్ తో పట్టుబడ్డారని, ఇతర కేసుల్లో ఇరుక్కున్నారంటూ వారి తల్లిదండ్రులకు ఫోన్ చేసి డబ్బులు వసూలు చేస్తున్నారు. దీంతో ఇలాంటి కాల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.












Click it and Unblock the Notifications