కెసిఆర్! మాకు బుద్ది వచ్చింది.. జాగ్రత్త, మజ్లిస్ నేతలు ఉగ్రవాదుల్లా: విహెచ్
హైదరాబాద్: పాతబస్తీలో మజ్లిస్ పార్టీ నేతలు ఉగ్రవాదుల్లా వ్యవహరించారని, ఆ పార్టీని పెంచి పోషించిన కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి వచ్చిందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు వి హనుమంత రావు బుధవారం నాడు ఆవేదన వ్యక్తం చేశారు.
పాతబస్తీని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు మజ్లిస్ పార్టీకి ఏమైనా రాసిచ్చారా అని ప్రశ్నించారు. మజ్లిస్ పార్టీకి మద్దతు ఇవ్వడం అంటే పాముకు పాలు పోసి పెంచినట్లేనని అన్నారు. మజ్లిస్‌కు ఇన్నాళ్లు అండగా ఉన్న తమకు తగిన బుద్ధి వచ్చిందన్నారు. మేం మోసపోయామన్నారు.
ముఖ్యమంత్రి కెసిఆర్ మేలుకోవాలన్నారు. పాతబస్తీ మజ్లిస్ అయ్య జాగీరా అన్నారు. ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ దగ్గరుండి కొట్టించడం ఏమిటన్నారు. అసద్ ఓ ఎంపీ అనే విషయం మర్చిపోతున్నాడా అన్నారు. కెసిఆర్! మజ్లిస్‌తో దోస్తీ చేసి మేం మోసపోయామని, మీరు మోసపోవద్దన్నారు.

తన భద్రతను మార్చాలని షబ్బీర్ అలీ లేఖ
పాతబస్తీలో తన పైన దాడి జరుగుతున్న సమయంలో భద్రత ఇవ్వలేకపోయిన ఇద్దరు సెక్యూరిటీ సిబ్బందిని తొలగించి, తనకు మరో ఇద్దరిని ఇవ్వాలని మండలి కాంగ్రెస్ పార్టీ పక్ష నేత షబ్బీర్ అలీ ఐఎస్‌డబ్ల్యుకి లేఖ రాశారు.
మజ్లిస్‌పై చట్టపరమైన చర్యలు: కవిత
టీఆర్‌ఎస్ ఎంపీ కవిత ఇవాళ నిజామాబాద్ జిల్లాలో పర్యటించారు. పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి పనులకు ఎంపీ కవిత, ఎమ్మెల్యే గణేష్ గుప్తా శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడారు. పాతబస్తీలో దాడి ఘటనపై మజ్లిస్ కార్యకర్తలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.
స్మార్ట్ సిటీల ఎంపికలతో తెలంగాణకు తీరని అన్యాయం జరిగిందన్నారు. రాష్ట్ర ఆవిర్భావం నుంచి కేంద్రం కుట్రపూరితంగానే వ్యవహరిస్తుందని మండిపడ్డారు. ఇంత వరకు రాష్ట్రంలో ప్రధాని మోడీ కాలు మోపకపోవడమే ఇందుకు నిదర్శనమన్నారు. గ్రేటర్ హైదరాబాద్ పీఠం టీఆర్‌ఎస్‌దేనని ధీమా వ్యక్తం చేశారు. గ్రేటర్‌లో పోలింగ్ రోజు జరిగిన ఘర్షణలకు బాధ్యులపై చర్యలు తీసుకోవాలన్నారు.
ఎమ్మెల్యే అక్బరుద్దీన్ పైన కేసు
మజ్లిస్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ పైన చాంద్రాయణగుట్ట పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. జంగంమెట్ట బిజెపి అభ్యర్థిపై దాడి ఘటనలో ఎమ్మెల్యే అక్బరుద్దీన్ సహా ఇతర నేతలపై కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. జిహెచ్‌ఎంసి ఎన్నికల సందర్భంగా నిన్న పాతబస్తీలో ఘర్షణలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
పాకిస్తాన్ క్రికెట్ కు ఓ దండం..మెయిన్ విలన్ ఆయనే: కిర్‌స్టెన్ -
"ధురంధర్" డైరెక్టర్ నెక్స్ట్ సినిమా ఆ స్టార్ హీరోతోనే ??? -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
డైరెక్ట్ గా ఇరాన్ నుంచే భారత్ ఆయిల్ కొనుగోళ్లు: గ్యాస్ కొరతకూ చెక్ -
డొనాల్డ్ ట్రంప్ సడన్ యూటర్న్- యుద్ధ విరామం -
'ధురంధర్ 2'పై టాలీవుడ్ హీరోల ప్రశంసలు.. ప్రకాష్ రాజ్ రియాక్షన్ ఇదే!












Click it and Unblock the Notifications