మజ్లిస్‌లో తొలి ధిక్కారం, రాజీనామాకు ఎమ్మెల్సీ నో - డ్రైవర్ గా మొదలై, పార్టీలో పవర్‌ఫుల్‌..!!

ఏఐఎంఐఎం (మజ్లిస్) పార్టీలో ఎమ్మెల్సీ రహ్మత్ బేగ్ వివాదం దుమారాన్ని రేపుతోంది. బేగ్ పై వచ్చిన ఆరోపణలు వాస్తవమని నిర్ధారించిన మజ్లిస్ అధిష్టానం అతన్ని పార్టీ నుంచి బహిష్కరిస్తూ నిర్ణయం తీసుకుంది. తక్షణమే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాలంటూ రహ్మత్ బేగ్‌ను ఆదేశించింది. అయితే, అందుకు అతను ససేమీరా అంటున్నారు. ఎక్కడ ఉన్నారో పార్టీ నేతల కు అంతు చిక్కటం లేదు. అయితే, డ్రైవర్ గా మొదలై... నేడు పార్టీలో ఎమ్మెల్యేల కంటే పవర్ ఫుల్ లీడర్ గా మారిన రహ్మత్ పై పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది.

బాలికపై అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న మజ్లిస్‌ ఎమ్మెల్సీ మీర్జా రహ్మత్‌ బేగ్‌ అదృశ్యమయ్యారు. ఆయనతో ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయించేందుకు పార్టీ నేతలు ప్రయత్నించగా.. ఇప్పుడే వస్తానంటూ తప్పించుకున్నారు. దీంతో రహ్మత్‌ బేగ్‌ కోసం మజ్లిస్‌ శ్రేణులు గాలిస్తున్నాయి. ఓ బాలికతో రహ్మత్‌ బేగ్‌ సన్నిహితంగా ఉండగా స్థానికులు గమనించి దాడి చేసిన వీడియో వైరల్‌గా మారింది. దీనిపై విచారణ జరిపించిన పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్‌ ఒవైసీ.. ఆరోపణలు వాస్తవమేనని తేలడంతో ఆయనను పార్టీ నుంచి బహిష్కరించారు. దీంతో ఎమ్మెల్సీ పదవిని వెంటనే వీడాలని, రాజీనామా పత్రాన్ని శాసనమండలి చైర్మన్‌కు అందజేయా లని పార్టీ ఆదేశించింది. కాగా, గత కొద్దిరోజులుగా ఉమ్రా యాత్ర కోసం సౌదీ అరేబియాలో ఉన్న రహ్మత్‌ బేగ్‌.. పార్టీ ఆదేశాలతో హైదరాబాద్‌కు వచ్చారు. రహ్మత్‌ బేగ్‌ స్పందిస్తూ.. తాను తప్పు చేయలేదని, రాజీనామా చేయబోనని మొండికేశారు. పార్టీ కార్యకర్తగా కొనసాగుతానన్నారు.

 హైదరాబాద్ లో మరో భారీ క్రికెట్ స్టేడియం - అహ్మదాబాద్ ను మించి, BCCI ఆమోదం..!!
హైదరాబాద్ లో మరో భారీ క్రికెట్ స్టేడియం - అహ్మదాబాద్ ను మించి, BCCI ఆమోదం..!!
mim-expelled-mlc-mirza-rahmat-baig-goes-missing-party-cadres-launch-search-details-here

పార్టీలో పవర్ ఫుల్ గా .. ధిక్కరణ

దీంతో పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా ధిక్కార స్వరం వినిపించిన రహ్మత్‌ బేగ్‌ను ఎంఐఎంకు చెందిన కొందరు సీనియర్‌ నేతలు రాజీనామా చేయాల్సిందేనంటూ బలవంతం చేశారు. అప్పటి కే సిద్ధం చేసిన ఎమ్మెల్సీ రాజీనామా పత్రంపై సంతకం చేయాలని కోరారు. ప్రార్థన చేసి వస్తానని వారిని కోరిన రహ్మత్‌ బేగ్‌ అక్కడి నుంచి తప్పించుకున్నట్టు సమాచారం. మజ్లిస్‌ పార్టీలో తొలిసారి ధిక్కార స్వరం వినిపించడం ఆ పార్టీలో చర్చనీయాంశంగా మారింది. ఓవైసీ సోదరులకు వ్యతిరేకంగా మాట్లాడేందుకు పార్టీలో ఎవరూ సాహసించరు. మిర్జా రహమత్‌ బేగ్‌ డ్రైవర్‌ స్థాయి నుంచి పార్టీలో కీలక నేతగా ఎదిగారు. నగరంలో ఎక్కడైనా శాంతిభద్రతల సమస్యలు ఎదురైనా పార్టీ ప్రతినిఽధిగా ఈయనే ముందుండి పరిస్థితిని చక్కదిద్దేవారు. పార్టీలో చేస్తున్న సేవలను గుర్తించి ఆయనను ఎమ్మెల్సీని చేశారు. మజ్లిస్ పార్టీలో అక్బరుద్దీన్ మినహా.. మిగిలిన ఆరుగురు ఎమ్మెల్యేల కంటే రహ్మత్ బేగ్ పవర్ ఫుల్ నేతగా ఉన్నారని సమాచారం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+