బెగ్గింగ్ లో ఇంత సంపాదనా..! : కళ్లు బైర్లు కమ్మాల్సిందే..

హైదరాబాద్ : 'అడుక్కోవడం చీప్..' కానీ ఈ చీప్ ట్రిక్ టర్నోవర్ అక్షరాల రూ.24 కోట్లు. అందుకే అడక్కోవడమనేది ఇప్పుడో ప్రొఫెషన్. పొట్ట కూటి కోసం కాదు.. సాఫ్ట్ వేర్ ఉద్యోగుల విలాసాలతో పోటీపడగల సత్తా వాళ్ల సొంతం. అడుక్కోవడానికే నటిస్తారు.. నిజ జీవితంలో సామాన్యుల కన్నా మిన్నగా జీవిస్తారు. బెగ్గింగ్ కి యాక్టింగ్ తో వాళ్లిచ్చే కోటింగ్ సంపాదనలో వాళ్లను కింగ్స్ ని చేస్తోంది.

తాజాగా హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్ వెల్లడించిన కొన్ని వివరాలను పరిశీలిస్తే ఈ వ్యాఖ్యలు నిజమే అనిపించక మానదు. నగరంలో కుప్పలు తెప్పలుగా జనాల మీదికి దండెత్తే బెగ్గర్స్ వెనుక ఇంత తతంగం నడుస్తోందా.. అనిపించడంలో అతియోశక్తి లేదు. హైదరాబాద్ లో బెగ్గర్స్ గురించి మేయర్ చేసిన ఆసక్తికర వ్యాఖ్యలు ఇప్పుడో హాట్ టాపిక్.

begging

మేయర్ రామ్మోహన్ చెప్పిన వివరాల ప్రకారం.. నగరంలో బెగ్గర్స్ సంపాదన నెలకు 2 కోట్ల చొప్పున ఏడాదికి రూ.24 కోట్లు. ఇందులో అసలైన బెగ్గర్స్ కేవలం రెండు శాతం మంది మాత్రమే కాగా సంపాదన కోసమే యాచక వృత్తిని ఎంచుకున్నవారు 98 శాతం మంది. ఒక్క హైదరాబాద్ పరిధిలోని బెగ్గింగ్ కి ఇంత టర్నోవర్ ఉంటే, ఇక ఇండియా మొత్తం కలిపితే పెద్ద, పెద్ద మల్టీ నేషనల్ కంపెనీలకు సైతం బెగ్గింగ్ వ్యాపారం పోటీ ఇచ్చే పరిస్థితి.

ఓ సర్వే సంస్థ వెల్లడించిన నివేదికలో ఈ బెగ్గింగ్ టర్నోవర్ గురించి తెలిసినట్టుగా చెప్పారు మేయర్ బొంతు రామ్మోహన్. యాచకుల వల్ల ఇబ్బందులను ఎదుర్కొంటున్నవారి సంఖ్య కూడా పెరిగిపోతుంది. దీంతో యాచక రహిత నగరంగా హైదరాబాద్ ను తీర్చిదిద్దాలని భావిస్తున్న మేయర్, ఇందుకోసం ఈ నెల 23న ఉదయం 10 గంటలకు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో ఓ సమావేశాన్ని ఏర్పాటు చేయబోతున్నట్టు తెలిపారు.

బెగ్గింగ్ ని నిర్మూలించడం, బెగ్గర్స్ కి డబ్బు ఇవ్వకుండా ప్రజల్లో అవగాహన కల్పించడం, బెగ్గింగ్ నిర్మూలనకు ప్రచారోద్యమం వంటి అంశాలపైన ఈ సమావేశంలో చర్చించనున్నారు. ఈ కార్యక్రమానికి జీహెచ్ఎంసీ అధికారులతో పాటు పోలీసులు, సంబంధిత సిబ్బంధి హాజరుకానున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+