మనమే చెవులు కొరుక్కుంటూ కాంగ్రెస్‌ను ప్రమోట్ చేస్తున్నాం: కేటీఆర్ ఆడియో వైరల్

తెలంగాణ ఎన్నికల ప్రచారం తుది దశకు చేరుతోంది. ఈ నెల 28తో ప్రచారం ముగియనుంది. ప్రధాన పార్టీ తరపున ముఖ్య నేతలు ప్రచార బరిలోకి దిగారు. ఇదే సమయంలో బీఆర్ఎస్ వర్సస్ కాంగ్రెస్ మధ్య హోరా హోరీ పోరు కొనసాగుతోంది. సిరిసిల్ల నుంచి మంత్రి కేటీఆర్ పోటీ చేస్తున్నారు. నియోజకవర్గంలో పార్టీ నేతలకు మంత్రి తాజాగా దిశా నిర్దేశం చేసారు. కాంగ్రెస్ ప్రచారం..గ్రాఫ్ గురించి కీలక వ్యాఖ్యలు చేసారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

నేతలకు దిశా నిర్దేశం : మంత్రి కేటీఆర్ సిరిసిల్లలో భారీ మెజార్టీ సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కానీ, చోటు చేసుకుంటున్న కొన్ని పరిణామాలతో అలర్ట్ అయ్యారు. నియోజకవర్గ నేతలతో సమీక్ష నిర్వహించారు. ఆ సమయంలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు బయటకు వచ్చాయి. తాను నియోజకవర్గంలోని అందరు నేతలతో మాట్లాడుతున్నానని చెప్పుకొచ్చారు.

Ministe KTR Key Directions for Party cadre to Face congress in Siricialla Constituency

ఎవరికి వారు తమ పరిధిలో ప్రజా స్పందన బాగుందని...పొరుగున ఉన్న వార్డు లేదా గ్రామంలో పరిస్థితి అలా ఉందంట..ఇలా ఉందంట అని చెబుతున్నారని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ అభ్యర్ది ఎవరితోనో కలిసారని..దీంతో ఆ వర్గం మొత్తం కాంగ్రెస్ వైపు మళ్లిందనే ప్రచారం సాగుతోందని వివరించారు. ఎన్నికల్లొ పోటీ చేసే అభ్యర్ది ఏ చిన్న అవకాశం దొరకినా ఖచ్చితంగా అందుకొని నిలబడే ప్రయత్నం చేస్తారని...అది సహజమని కేటీఆర్ పేర్కొన్నారు.

కలిసికట్టుగా పని చేయాలి : కాంగ్రెస్ కు గ్రాఫ్ పెరుగుతోందని మన పార్టీ నేతలే కొందరు చెబుతున్నట్లు తన వద్దకు విషయం చేరిందని చెప్పినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ ఎన్నికల వ్యూహాల్లో ఇదంతా భాగమని చెప్పుకొచ్చారు. ఎవరో కేటీఆర్ సిరిసిల్లలో ఓడిపోతున్నారని రాసారని..మనలో అందరూ కలిసికట్టుగా భారీ మెజార్టీ లక్ష్యంగా పని చేయాలని సూచించారు.

ఈ వారం రోజులు ఎవరైనా ఏవైనా చిన్ని చిన్న సమస్యలు ఉన్నా..మెజార్టీ కోసం పని చేయాలని నిర్దేశించారు. తాను ఇక నుంచి ఖచ్చితంగా నియోజకవర్గ కేడర్ కు అందుబాటులో ఉంటానని స్పష్టం చేసారు. రాష్ట్రం మొత్తం సిరిసిల్లలో వచ్చే మెజార్టీ పైనే చూస్తుందని..ఎవరూ ఏ మాత్రం నిర్లక్ష్యం గా ఉండవద్దని సూచించారు. ప్రజలను సంచాయించుకోకపోతే నష్టపోతామని హెచ్చరించారు.

Ministe KTR Key Directions for Party cadre to Face congress in Siricialla Constituency

అందరూ చూపు ఇటే : ఎవరూ కోపాలకు పోవద్దని..అన్నీ మరిచి మంచి మెజార్టీ కోసం పని చేయాలన్నారు. ఎక్కడైనా చిన్ని చిన్న సమస్యలు వచ్చి..ఎవరైనా ప్రశ్నిస్తే ఇన్ని చేసిన మనం..ఈ చిన్నది చేయమా అనేది ఓపికగా చెప్పాలని సూచించారు.

వ్యక్తిగత అంశాలు మరిచి..ఈ వారం రోజుల్లో ప్రతీ ఇంటికి వెళ్లి పార్టీ చేసిన సంక్షేమం..నియోజవర్గంలో వచ్చిన మార్పులు వివరించాలని సూచించారు. కేవలం వెళ్లి కరపత్రం ఇవ్వటం కాకుండా వారితో మమేకం కావాలని కోరారు. ఇక, కేటీఆర్ పార్టీ నేతలతో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+