Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కాకా కుమారుని ఇంట్లో దత్తన్న, పరామర్శ(ఫోటోలు)

హైదరాబాద్: కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ ఆదివారం సోమాజిగూడలో జి. వెంకటస్వామి (కాకా) కుమారుడు మాజీ ఎంపీ వివేక్‌ని మర్యాదపూర్వకంగా కలిశారు. వివేక్ నివాసంలో ఆయన కుటుంబసభ్యులకు సానుభూతి తెలియజేశారు. ఈ సందర్భంగా దత్తాత్రేయ మాట్లాడుతూ పేదల మనస్సుల్లో మంచి నేతగా నిలిచిపోయారన్నారు.

అనంతరం కాసేపు వారితో ముచ్చటించారు. కాకా చిత్ర పటానికి నివాళులు అర్పించారు. కాకా కుమారులు మాజీ మంత్రి జీ వినోద్, మాజీ ఎంపీ వివేక్‌ను దత్తాత్రేయ ఓదార్చారు. మాజీ కేంద్ర మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జి.వెంకటస్వామి అనారోగ్యంతో కన్నుమూసిన విషయం తెలిసిందే.

కాంగ్రెస్‌ పార్టీలో కిందిస్థాయి నుంచి ఉన్నత పదవులను అలంకరించిన నేత. దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీకోసం పనిచేశారు. ఎంతోమంది నేతలకు ఆదర్శప్రాయుడు. రాష్ట్రపతి కావాలని కోరుకున్నా ఆయన కోరిక నెరవేరలేదు.

ఇందిరాగాంధీ మంత్రివర్గంలో కేంద్ర కార్మిక శాఖ మంత్రిగా 1972 నుంచి 77 వరకు కొనసాగారు. 1978 నుంచి 82 వరకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంలో లేబర్‌ అండ్‌ సివిల్‌ సప్లయిస్‌ మంత్రిగా వ్యవహరించారు.1991-96లో పివి నరసింహారావు ప్రధాని హయాంలో కేంద్ర గ్రావిూణాభివృద్ధి శాఖకు స్టేట్‌ మినిస్టర్‌గా పనిచేశారు. 1993లో కేంద్ర టెక్స్‌టైల్‌ మినిస్టర్‌గా బాధ్యతలు చేపట్టారు.

 కాకా కుమారులను ఓదార్చిన దత్తాత్రేయ

కాకా కుమారులను ఓదార్చిన దత్తాత్రేయ

కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ ఆదివారం నాడు మాజీ ఎంపీ వివేక్‌ను మర్యాద పూర్వకంగా కలిసేందుకు ఇంటికి వెళ్లాడు.

 కాకా కుమారులను ఓదార్చిన దత్తాత్రేయ

కాకా కుమారులను ఓదార్చిన దత్తాత్రేయ

ఇంట్లో ఉన్న కాకా చిత్ర పటానికి కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ నివాళులు అర్పించారు.

 కాకా కుమారులను ఓదార్చిన దత్తాత్రేయ

కాకా కుమారులను ఓదార్చిన దత్తాత్రేయ

వివేక్ నివాసంలో ఆయన కుటుంబసభ్యులకు సానుభూతి తెలియజేశారు. అనంతరం కాసేపు వారితో ముచ్చటించారు.

కాకా కుమారులను ఓదార్చిన దత్తాత్రేయ

కాకా కుమారులను ఓదార్చిన దత్తాత్రేయ

కాకా కుమారులు మాజీ మంత్రి జీ వినోద్, మాజీ ఎంపీ వివేక్‌ను దత్తాత్రేయ ఓదార్చారు. మాజీ కేంద్ర మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జి.వెంకటస్వామి అనారోగ్యంతో కన్నుమూసిన విషయం తెలిసిందే.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+