వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బండి సంజయ్ రాజకీయ బచ్చా: నీది నోరా.. హైదరాబాద్ పెద్దమోరా? మంత్రి ఎర్రబెల్లి వీరంగం

|
Google Oneindia TeluguNews

ఖమ్మం బీఆర్ఎస్ సభను ఎవరు పట్టించుకోలేదని, అందరూ ఇండియా న్యూజిలాండ్ క్రికెట్ మ్యాచ్ పైనే ఉన్నారని చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రులు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. తాజాగా రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ బండి సంజయ్ వ్యాఖ్యలపై వీరంగం వేశారు.

 ఖమ్మం సభ అట్టర్ ప్లాప్ అంటారా? భగ్గుమన్న మంత్రి ఎర్రబెల్లి

ఖమ్మం సభ అట్టర్ ప్లాప్ అంటారా? భగ్గుమన్న మంత్రి ఎర్రబెల్లి

ఖమ్మం సభ అట్టర్ ప్లాప్ అన్న బిజెపి, కాంగ్రెస్ పార్టీలపై తీవ్ర స్థాయిలో ఫైరయ్యారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పై అయినా విరుచుకుపడ్డారు. తెలంగాణ రాష్ట్రంలో ఏ మాత్రం అభివృద్ధి జరగలేదని చెప్తున్న వారికి, దమ్ముంటే అభివృద్ధిపై చర్చకు రావాలంటూ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సవాల్ విసిరారు. మోడీ తెలంగాణ రాష్ట్రంపై సవతి తల్లి ప్రేమ చూపిస్తుంటే సీఎం కేసీఆర్ కన్న తల్లిదండ్రుల మాదిరిగా వ్యవహరిస్తున్నారని మంత్రి ఎర్రబెల్లి కితాబిచ్చారు.

ప్రతిపక్షాలకు మంత్రి ఎర్రబెల్లి సవాల్

ప్రతిపక్షాలకు మంత్రి ఎర్రబెల్లి సవాల్


ఖమ్మం లో జరిగిన సభను చూసి ప్రతిపక్ష పార్టీలు భయపడుతున్నాయని పేర్కొన్న మంత్రి ఎర్రబెల్లి, ప్రతిపక్షాలకు వెన్నులో వణుకు పుడుతుంది అన్నారు. దేశంలో కాంగ్రెస్ కనిపించకుండా పోయిందని ఈసారి ప్రజలు బిజెపి భరతం పట్టడం ఖాయమని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. దేశాన్ని అందరికీ ఆమోదయోగ్యంగా పాలించే సత్తా, దమ్ము ఒక సీఎం కేసీఆర్ కే ఉందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పేర్కొన్నారు. బిజెపి, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలలో జరిగిన అభివృద్ధికి.. తెలంగాణలో చేసిన అభివృద్ధికి పొంతన లేదని అభివృద్ధి మీద చర్చ చేద్దామా అంటూ సవాల్ విసిరారు. మిషన్ భగీరథ మీద కానీ, గ్రామాల అభివృద్ధి పై కాని దేని మీద నైనా చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు

బీజేపీకి ప్రశ్నల వర్షం కురిపించిన మంత్రి

బీజేపీకి ప్రశ్నల వర్షం కురిపించిన మంత్రి

మేము దేశమంతా ఉచిత కరెంట్ ఇస్తామంటే, నీకు ఎందుకు కళ్ళ మంట? అని బండి సంజయ్ ను ప్రశ్నించారు. దేశంలోని దళితులకు దళిత బంధు ఇస్తామంటే మీకేమి కడుపు మంట? అంటూ నిలదీశారు. తెలంగాణ రాష్ట్రానికి ఇస్తామని చెప్పిన విభజన హామీలు ఏమయ్యాయి? మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలు ఏమయ్యాయి? రాష్ట్రానికి ఇచ్చిన నిధులు ఎన్ని? మీరు ఎగ్గొట్టిన మాకు ఇవ్వాల్సిన వాటా ఎంత? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. కేంద్ర‌మే రైతు బంధు, మిష‌న్ భ‌గీర‌థ వంటి తెలంగాణ ప‌థ‌కాల‌ను కాపీ కొట్టి అమ‌లు చేస్తుందని ఎద్దేవా చేశారు.

 బండి సంజయ్ ను తిట్టిపోసిన మంత్రి ఎర్రబెల్లి

బండి సంజయ్ ను తిట్టిపోసిన మంత్రి ఎర్రబెల్లి

ఇంత‌కాలం బండి సంజయ్ కు తల మీద వెంట్రుకలే లేవు అనుకున్నాను కానీ, తలలో మెదడు కూడా లేనట్టుంది అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బండి సంజయ్ కళ్ళకు పొరలు కమ్మినట్లు ఉన్నాయి.. తెలంగాణ ప్రభుత్వం విజయవంతంగా నిర్వహిస్తున్న కంటి వెలుగులో పరీక్షలు చేయించుకొని.. ఉచితంగా అద్దాలు ఇస్తున్నాము.. తీసుకో అంటూ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వ్యాఖ్యలు చేశారు. నిన్న క్రికెట్ మ్యాచ్ ను తప్ప, ఖమ్మం మీటింగ్ ని ఎవరూ పట్టించుకోలేదు అంటావా?! ఆటకు, మాటకు తేడా తెలవని రాజకీయ బచ్చావి. అంత మంది జనం వచ్చింది కనిపించలేదా? అంటూ నిప్పులు చెరిగారు. ఇక ఖమ్మం సభలో ప్రజలు మనస్ఫూర్తిగా పాల్గొనలేదని బండి సంజయ్ కు చెప్పి వచ్చారా అంటూ సెటైర్లు వేశారు.

నీది నోరా.. హైదరాబాద్ పెద్ద మోరా? బండి సంజయ్ పై ఫైర్

నీది నోరా.. హైదరాబాద్ పెద్ద మోరా? బండి సంజయ్ పై ఫైర్

కర్ణాటక మాజీ సీఎం రాలేదు, బీహార్ తాజా సీఎం రాలేదు.. ఎవరు వస్తే నీ కేంటి రాక పోతే నీ కెందుకు? అంత ఉంటే వాళ్ళనే అడుగు చెబుతారు అంటూ అసహనం వ్యక్తం చేశారు. వాళ్ళేమైనా నీ లెక్క పనికి మాలినోళ్ళా..? ఖాళీగా ఉండ‌టానికి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. చిల్లర మాటలతో జాతీయ నేతలను అవమానించడం మంచి సంస్కారం కాదని విమర్శించారు. నీది నోరా? హైదరాబద్ పెద్ద మోరా?! ముందు చెప్పు అంటూ ప్రశ్నించారు. ఏ రోజైనా ఒక మంచి మాట నీ నోటి నుంచి వస్తుందా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కరెంట్ ఎప్పుడు వస్తుందో పోతుందో తెలియదని అంటావా.. ఎక్కడైనా కరెంటు తీగను పట్టుకో నీకే తెలుస్తుంది అంటూ బండి సంజయ్ ను తిట్టిపోశారు. నోటికొచ్చినట్టు మాట్లాడితే ఖబర్దార్ అంటూ వార్నింగ్ ఇచ్చారు.

English summary
Minister Errabelli Dayakar Rao lashed out at Bandi Sanjay saying that KCR BRS meeting failed. Minister errabelli dayakar rao gave a warning to Bandi Sanjay.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X