చంద్రబాబు, పవన్ కల్యాణ్ పై హరీష్ కీలక వ్యాఖ్యలు..!!
తెలంగాణ ఎన్నికల ప్రచారం హోరెత్తుతోంది. ఈ రోజు ఎన్నికల నోటిఫికేషన్ జారీ కావటంతో నామినేషన్ల ప్రక్రియ ఆరంభమైంది. బీఆర్ఎస్ నుంచి సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్ - హరీష్ ఎన్నికల ప్రచారం లో కీలకంగా వ్యవహరిస్తున్నారు. తాజాగా తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయించిన టీడీపీ అధినేత చంద్రబాబు...వైఎస్సార్టీపీ అధినేత్రి షర్మిల తో సహా బీజేపీతో పొత్తుతో బరిలోకి దిగుతున్న పవన్ పైన మంత్రి హరీష్ కీలక వ్యాఖ్యలు చేసారు.
మంత్రి హరీష్ రావు సిద్దిపేటలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తెలంగాణలో పోటీ చేయనని చెబుతున్న చంద్రబాబు లోలోపల కాంగ్రెస్ కు మద్దతిస్తున్నారని హరీష్ పేర్కొన్నారు. అటు బీజేపీ పవన్ కల్యాణ్ తో పొత్తు పెట్టుకుందని గుర్తు చేసారు. తెలంగాణ వస్తే 11 రోజులు అన్నం తినకుండా బాధ పడిన పవన్ కల్యాణ్ తో బీజేప ఏ విధంగా పొత్తు పెట్టుకుంటుందని ప్రశ్నించారు. తెలంగాణను వ్యతిరేకించిన వైఎస్సార్ కుమార్తె షర్మిల ఇప్పుడు కాంగ్రెస్ కు మద్దతు ఇస్తున్నారని చెప్పారు. రేవంత్ రెడ్డి తెలంగాణ వ్యతిరేకిగా హరీష్ ఆరోపించారు. ఎమ్మెల్యే జగ్గారెడ్డి తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకించారని చెప్పుకొచ్చారు. తెలంగాణ వ్యతిరేకులంతా ఒక్కటవుతన్నారని హరీష్ ఆరోపించారు.

తెలంగాణలో అమలు చేస్తున్న సంక్షేమం ఇప్పుడు దేశానికే ఆదర్శంగా నిలుస్తుందన్నారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల మేరకు అధికారంలోకి వస్తే ప్రతీ కుటుంబానికి మరింతగా మేలు చేస్తామని హామీ ఇచ్చారు. పదేళ్ల కాలంగా ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ అన్ని రంగాల్లోనూ పురోగతి సాధించిందని చెప్పుకొచ్చారు. జగ్గారెడ్డి లాంటి వాళ్లను ఓడించాలని హరీష్ పిలుపునిచ్చారు. షర్మిల తన పార్టీ ఎన్నికల పోటీ నుంచి తప్పకుంటుందని ప్రకటించారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ కు బేషరతుగా మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదనే కారణంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా షర్మిల చెప్పుకొచ్చారు. ఇప్పుడు చంద్రబాబు..పవన్ పైన హరీష్ చేసిన వ్యాఖ్యలకు ఆ పార్టీల నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.
-
పవన్ ఉగ్రరూపం: ఎమ్మెల్యేలకు లాస్ట్ వార్నింగ్, ఇక యాక్షన్ తప్పదు -
పవన్ Vs విజయ్, మమత- చంద్రబాబు : ఆ రెండు రాష్ట్రాల్లో మోదీ బిగ్ టాస్క్..!? -
ఇంటింటికీ గంగమ్మ: డ్వాక్రా మహిళలకు కీలక బాధ్యతలు -
Janasena: టీడీపీ తీరుపై రగులుతున్న జనసేన ఎమ్మెల్యేలు ? ఇవాళ పవన్ ముందే..! -
రాజకీయ దురంధురుడు చంద్రబాబు: స్టీల్ ప్లాంట్ భూమిపూజలో పవన్ కళ్యాణ్ కితాబు! -
పవన్ "ఉస్తాద్" మూవీకి థియేటర్ మెయింటెనెన్స్ ఖర్చులు కూడా వచ్చేలా లేవా ??? -
గుండెపై "నాగబాబు" పేరు టాటూగా వేసుకున్న టీడీపీ హార్డ్ కోర్ ఫ్యాన్ !! -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం











Click it and Unblock the Notifications