ప్రొఫెషనల్ క్రికెటర్‌లా.. టీ20లో అదరగొట్టిన హరీష్ రావు... బౌండరీలతో హోరెత్తించిన మంత్రి...
రాజకీయాల్లో ఆయన ట్రబుల్ షూటర్.. ఏ బాధ్యత అప్పగించినా ఒంటిచేత్తో నెరవేర్చే సత్తా ఉన్నా నాయకుడు... చాలామందికి తెలియని విషయమేంటంటే ఆయనలో మరో కోణం కూడా ఉంది... బ్యాట్ పడితే ప్రొఫెషనల్ క్రికెటర్ తరహాలో పరుగుల వరద పారించగలడు. ఆయనే మంత్రి హరీష్ రావు. రాజకీయాల్లో నిరంతరం బిజిబిజీగా గడిపే హరీష్... బుధవారం(డిసెంబర్ 2) ఓ ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్‌లో క్రికెటర్ అవతారమెత్తారు.
Recommended Video
నిన్న,మొన్నటిదాకా జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో తీరిక లేకుండా గడిపిన మంత్రి హరీష్ రావు... బుధవారం రాత్రి సిద్దిపేటలో ఆటవిడుపుగా టీ20 క్రికెట్ ఆడారు. హైదరాబాద్‌కు చెందిన మెడికవర్ ఆస్పత్రి-సిద్దిపేట జిల్లా క్రికెట్ అసోసియేషన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో పాల్గొన్నారు. సిద్దిపేట జట్టుకు కెప్టెన్సీ వహించిన హరీష్... నాలుగో స్థానంలో క్రీజులోకి వచ్చి 12 బంతుల్లో 18 పరుగులు చేసి ఔటయ్యారు. క్రీజులోకి వస్తూనే రెండు వరుస బౌండరీలు బాదారు. మైదానంలో ప్రొఫెషనల్ క్రికెటర్‌లా బ్యాటింగ్ చేసిన హరీష్‌ను చూసి ప్రేక్షకులు,అభిమానులు కేరింతలు కొట్టారు.

ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కి దిగిన సిద్దిపేట జట్టు నిర్ణీత 20ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. ప్రస్తుతం హైదరాబాద్ జట్టు బ్యాటింగ్ చేస్తోంది. మంత్రి హరీష్ రావును క్రికెటర్ అవతారంలో చూసిన అభిమానులు సంబరపడిపోతున్నారు. తమ నాయకుడు రాజకీయాల్లోనే కాదు,మైదానంలోనూ అదరగొట్టగలడని చెప్తున్నారు.












Click it and Unblock the Notifications