పచ్చబడ్డ తెలంగాణాపై విషం చిమ్ముతున్నాడు; కరెంట్ షాకివ్వాలి: రేవంత్ రెడ్డిపై మంత్రి హరీష్ రావు!!

రాష్ట్రంలో ఉచిత విద్యుత్తు అవసరం లేదంటూ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేసిన ప్రకటన నేపథ్యంలో, కాంగ్రెస్ పార్టీ రైతు వ్యతిరేక ఆలోచనా విధానానికి వ్యతిరేకంగా ఈరోజు, రేపు తెలంగాణ వ్యాప్తంగా నిరసనలకు భారత రాష్ట్ర సమితి పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.

తెలంగాణ రైతన్నకి 24 గంటలు ఉచిత విద్యుత్ వద్దు అంటూ కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన నేపథ్యంలో ప్రతి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ దిష్టిబొమ్మల దహనానికి పిలుపు నిచ్చింది బీఆర్ఎస్. ఉచిత విద్యుత్ కార్యక్రమాన్ని రద్దు చేయాలన్న దుర్మార్గపు ఆలోచన కాంగ్రెస్ పార్టీదని బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. గతంలో కూడా విద్యుత్ ఇవ్వకుండా రైతులను గోసపెట్టిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదని విమర్శిస్తున్నారు.

Minister Harish Rao targets Revanth Reddy

మరోసారి తన రైతు వ్యతిరేక విధానాలను కాంగ్రెస్ పార్టీ బయటపెట్టుకుందని, దీన్ని తెలంగాణ రైతాంగం తెలంగాణ ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించాలని ఇప్పటికే మంత్రి కేటీఆర్ పేర్కొన్న విషయం తెలిసిందే.ఇక తాజాగా సోషల్ మీడియా వేదికగా రాష్ట్ర ఆర్ధిక శాఖా మంత్రి హరీష్ రావు తనదైన శైలిలో సోషల్ మీడియా వేదికగా రేవంత్ రెడ్డిని టార్గెట్ చేశారు.

రైతు వ్యతిరేకి కాంగ్రెస్ పార్టీ అంటూ పేర్కొన్న మంత్రి హరీష్ రావు కాంగ్రెస్ పార్టీకి ధరణి వద్దు.. రైతు బంధు వద్దు..ఉచిత కరెంటు వద్దు.. అంటూ సోషల్ మీడియా వేదికగా టార్గెట్ చేశారు. రైతన్న సంక్షేమం కోసం ఏనాడూ ఆలోచించని కాంగ్రెస్ పార్టీ నాయకులు, కేసీఆర్ గారి పాలనలో రైతులకు అందుతున్న సంక్షేమ, అభివృద్ధి ఫలాలను అధికారంలోకి వస్తే అందకుండా చేస్తామంటూ అడ్డగోలుగా మాట్లాతున్నారని మంత్రి హరీష్ రావు మండిపడ్డారు.

నాడు తెలంగాణ ఉద్యమంపై తుపాకీ ఎక్కుపెట్టిన మనిషే, నేడు పచ్చ బడ్డ తెలంగాణను చూసి విషం చిమ్ముతున్నాడు అంటూ రేవంత్ రెడ్డి తెలంగాణా వ్యతిరేఖి అన్నట్టు వ్యాఖ్యలు చేశారు.పార్టీ మారినా మనిషి మారలేదు.. మనసు కరగ లేదు అంటూ హరీష్ రావు రేవంత్ రెడ్డిని ఉద్దేశించి పేర్కొన్నారు.

పైశాచికత్వంతో తెలంగాణ సమాజంపై పగబట్టినట్టు వ్యవహరిస్తున్న కాంగ్రెస్ పార్టీకి, ఆ పార్టీ అధ్యక్షుడికి రైతులు తగిన శాస్తి చేయాలి అంటూ హరీష్ రావు పేర్కొన్నారు. రైతన్నకు కరెంట్ వద్దన్న కాంగ్రెస్ నాయకులకు వచ్చే ఎన్నికల్లో కరెంట్ షాక్ ఇవ్వాలి అని మంత్రి హరీష్ రావు ప్రజలకు సూచించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+