రేవంత్‌వి పచ్చి అబద్ధాలు: జూపల్లి, ఏపీ ప్రభుత్వ ఏజెంట్‌గా రేవంత్: గట్టు
హైదరాబాద్: తెలంగాణ తెలుగుదేశం పార్టీ నాయకులు పచ్చి అబద్దాలు మాట్లాడి ఎవర్ని మోసం చేయాలని చూస్తున్నారని పరిశ్రమల శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ధ్వజమెత్తారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు కేంద్ర ప్రభుత్వానికి రాసిన లేఖలో స్పష్టంగా పాలమూరు ఎత్తి పోతల పథకం, నక్కలగండి ప్రాజెక్టులు కొత్తవి అని వాటికి అనుమతుల్లేవు అని రాశారని అన్నారు.
రేవంత్ రెడ్డి మాత్రం దానిని తప్పుగా తర్జూమా చేసి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ధ్వజమెత్తారు. రేవంత్‌రెడ్డి మళ్లీ పలక బలపం తీసుకుని బడికి పోతే బాగుంటుందని సూచించారు. అరిగిపోయిన రికార్డుల్లా చంద్రబాబు భజన చేస్తున్నారని మండిపడ్డారు.

డొంక తిరుగుడు మాటలు మానుకోవాలని హెచ్చరించారు. పాలమూరు ఎత్తిపోతలకు అభ్యంతరం లేదని బాబుతో టీడీపీ నేతలు లేటర్ రాయిస్తారా అని సవాల్ చేశారు. అన్ని అనుమతులున్న బీమా ప్రాజెక్టుకు 19 ఏళ్లలో రూ. 17 వేల కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారని తెలిపారు. ఈ ప్రాజెక్టుకు టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏడాదిలో రూ. 707 కోట్లు ఖర్చు చేసిందని పేర్కొన్నారు.
గత ప్రభుత్వాలు నెట్టెంపాడుకు ఒక్క పైసా ఖర్చు పెట్టలేదని, తమ ప్రభుత్వం నెట్టెంపాడుతో పాటు పలు ప్రాజెక్టులకు రూ. 200 కోట్ల పైనే బడ్జెట్‌లో కేటాయించిందని పేర్కొన్నారు. తాము ఎప్పుడూ ప్రజల పక్షమే.. సీమాంధ్ర పక్షం కాదని తేల్చిచెప్పారు.
ప్రజల పక్షం వహించాం కాబట్టే గాంధీ భవన్ నుంచి తెలంగాణ భవన్‌కు వచ్చామని తెలిపారు. అధికారంలో ఉన్న పార్టీ బంద్‌కు పిలుపునివ్వడం ఏంటని కొందరు ప్రశ్నిస్తున్నారని, కొంత మంది నీచ నికృష్ట పనుల వల్లనే బంద్‌కు పిలుపునివ్వాల్సి వచ్చిందని పేర్కొన్నారు.
చంద్రబాబు, రేవంత్ రెడ్డి చీడపురుగులు: గట్టు
తెలుగు జాతికి చంద్రబాబు, తెలంగాణకు రేవంత్‌రెడ్డి చీడపురుగులు అని టీఆర్‌ఎస్ నేత గట్టు రామచందర్‌రావు ధ్వజమెత్తారు. అన్నం పెట్టిన జిల్లా మీద కక్ష గట్టి పాలమూరు, నక్కలగండిని రేవంత్ అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో ఏపీ ప్రభుత్వం ఏజెంట్‌గా రేవంత్‌రెడ్డి పని చేస్తున్నారని మండిపడ్డారు.
చంద్రబాబుకు ఊడిగం చేస్తూ తెలంగాణ ప్రజలను అవమానపరుస్తున్నాడని ధ్వజమెత్తారు. కేవీపీకి కేసీఆర్‌కు సంబంధముందని పిచ్చిపట్టినట్లు మాట్లాడిన రేవంత్‌ను ఎర్రగడ్డ పిచ్చాసుపత్రిలో చేర్పించాలని సూచించారు. నోరు అదుపులో పెట్టుకోకపోతే కొడంగల్ నియోజక వర్గ ప్రజలే రేవంత్‌కు తగిన బుద్ధి చెబుతారని అన్నారు.












Click it and Unblock the Notifications