హరీష్ కు మంత్రి కోమటిరెడ్డి బిగ్ ఆఫర్..!!

తెలంగాణ రాజకీయాలు హోరా హోరీగా మారాయి. కాలేశ్వరం ప్రాజెక్టు వ్యవహారం పైన ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. నల్గొండ సభ ద్వారా రేవంత్ ప్రభుత్వం పైన పోరాటానికి కేసీఆర్ సిద్దమయ్యారు. ఈ సమయం లోనే అసెంబ్లీ వేదికగా ఇరు పార్టీల నేతల మధ్య మాటల యుద్దం కొనసాగుతోంది. రేవంత్ వ్యాఖ్యల పైన హరీష్ ఆసక్తికరంగా స్పందించారు. దీని పైన రియాక్ట్ అయిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హరీష్ కు బంపరాఫర్ ఇచ్చారు.

హరీశ్ రావుపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే బీఆర్ఎస్ పార్టీ నాలుగు ముక్కలు కావటం ఖాయమని వ్యాఖ్యానించారు. హరీష్ వ్యాఖ్యలు కేసీఆర్, కేటీఆర్ కు వెన్నుపోటు పొడిచేలా ఉన్నాయని చెప్పుకొచ్చారు. హరీష్ ముఖ్యమంత్రి కావాలనే ప్లాన్ లో ఉన్నారని పేర్కొన్నారు. కేసీఆర్‌ను వ్యతిరేకించి వస్తే అందుకు సపోర్ట్ చేస్తామని చెప్పారు. ఆ పార్టీ కవిత, హరీశ్, కేటీఆర్‌ల పేర్ల మీద విడిపోతుందని.. బీఆర్ఎస్‌లో నాలుగు పార్టీలు అవుతాయని వ్యాఖ్యలు చేశారు. హరీశ్ రావు పార్టీలో ఎల్పీ లీడర్ కూడా కాలేదని, 20 మందితో ఆ పార్టీ లీడర్ కావాలని సవాల్ విసిరారు.

Minister Komatireddy Venkat Reddy Big offer for BRS Leader Harish Rao

కట్టె పట్టుకొని తిరుగుతున్న కేసీఆర్ పులి ఎట్లా అవుతారని, 60 కిలోలు ఉన్న వ్యక్తి పులి అయితే 86 కిలోలు ఉన్న తానేం కావాలని కోమటిరెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఇంకో 20 ఏళ్లు కాంగ్రెస్ పార్టీనే అధికారంలో ఉంటుందని కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. తాజాగా కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా బ్యారేజీల్లో నీటి నిల్వ గురించి నల్గొండ సభలో కేసీఆర్ వ్యాఖ్యల పై సభలో రేవంత్ స్పందించారు. నీటిని నింపటం సాధ్యమైతే హరీష్ కే బాధ్యతలు అప్పగిస్తానని సీఎం రేవంత్ వ్యాఖ్యానించారు. దీనికి సిద్దమంటూ హరీష్ ముందుకొచ్చారు. ఆ సమయంలో తనకు సీఎం పదవి ఇస్తే చేసి చూపిస్తానని చెప్పుకొచ్చారు. ఇప్పుడు హరీష్ వ్యాఖ్యల పైన రాజకీయంగా చర్చ సాగుతోన్న వేళ..మంత్రి కోమటిరెడ్డి స్పందించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+