కన్నీరు పెట్టుకున్న కొండా సురేఖ- నివాళి

Konda Surekha: తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ విషాదంలో మునిగిపోయారు. తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. కన్నీటి పర్యంతం అయ్యారు. దీనికి కారణం- ఎంతో ఆత్మీయంగా, అపురూపంగా పెంచుకుంటోన్న పెట్ డాగ్ ఆకస్మికంగా మరణించడమే. దీన్ని ఆమె తట్టుకోలేకపోయారు. కన్నీటి నివాళి అర్పించారు.

ఆ పెట్ డాగ్ పేరు హ్యాపీ. ఇన్ని రోజులూ తన వెంట తిరుగుతూ సందడి చేసిన హ్యాపీ శాశ్వతంగా దూరం కావడం కొండా సురేఖను తీవ్ర ఆవేదనకు గురి చేసింది. తనను వదిలి తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయిన పెట్ డాగ్‌కు ఆమె కన్నీటి నివాళి అర్పించారు. పూలు చల్లి నివాళి అర్పించారు. సాష్టాంగ నమస్కారం చేశారు. అనంతరం ప్రత్యేకంగా అంత్యక్రియలు చేయించారు.

Minister Konda Surekha breaks down after sudden death of her pet dog

పెంపుడు జంతువులు అంటే కొండా సురేఖకు చాలా ఇష్టం. ఆ ఇష్టంతోనే చాలాకాలంగా ఈ పెట్ డాగ్‌ను పెంచుకుంటోన్నారు. మంత్రిగా ఎంత పని ఒత్తిడిలో ఉన్నప్పటికీ ఇంటికి రాగానే తన చుట్టూ తిరుగుతూ సందడి చేసే హ్యాపీని చూస్తే మానసికంగా ఎంతో ప్రశాంతత కలుగుతుంటుందని చెప్పారు కొండా సురేఖ.

హ్యాపీతో కొండా సురేఖకు ఆత్మీయ అనుబంధం ఉంది. ఈ ఉదయం ఆకస్మికంగా హ్యాపీ చనిపోవడంతో దిగ్భ్రాంతికి గురయ్యారు. కన్నీటి పర్యంతం అయ్యారు. కళేబరంపై పూలు చల్లి నివాళి అర్పించారు. క‌న్నీరుమున్నీరయ్యారు. అనంతరం అంతిమ సంస్కారాలు నిర్వహించారు. కొండా సురేఖతో పాటు ఆమె కుటుంబ సభ్యులు, సిబ్బంది హ్యాపీ మరణంతో ఆవేదనకు గురయ్యారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+