డిసైడైన కొండా సురేఖ - కీలక నిర్ణయం...!!
తెలంగాణ ప్రభుత్వంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కొండా సురేఖ వివాదం కొత్త మలుపు తీసుకుంది. ఢిల్లీ కేంద్రంగా కీలక మంత్రాంగానికి ముహూర్తం ఖరారైంది. మంత్రివర్గ ప్రక్షాళనకు తుది కసరత్తు జరుగుతోంది. మంత్రి పదవిని తప్పించటం ఖాయమని ప్రచారం సాగుతున్న వేళ కొండా సురేఖ కీలక నిర్ణయం తీసుకున్నారు. తన శాఖ అధికారులకు దీనికి అనుగుణంగా ఆదేశాలు ఇచ్చారు.
తెలంగాణ కేబినెట్ లో కొద్ది రోజులుగా కొండా సురేఖ వ్యవహారం సంచలనంగా మారింది. సీఎం రేవంత్ పై సురేఖ కుమార్తె చేసిన కామెంట్స్ తో మొదలైన వ్యవహారం ఢిల్లీకి చేరింది. ఈ వారంలో నే సీఎం రేవంత్ ఢిల్లీలో హైకమాండ్ తో భేటీ కానున్నారు. ఆ సమయంలో సురేఖ పైన నిర్ణయం వెలువడే అవకాశం కనిపిస్తోంది. కాగా.. ఈ వివాదం తరువాత ఎలాంటి వ్యాఖ్యలు చేయకుండా మౌనంగా ఉంటున్న కొండా సురేఖ ఈ రోజు తిరిగి తన విధుల పైన ఫోకస్ చేసారు. గోదావరి పుష్క రాల పైన సమీక్ష చేసారు. తెలంగాణలో గోదావరి పుష్కరాలను ఈసారి ఘనంగా నిర్వహించేలా ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేస్తోందని మంత్రి కొండా సురేఖ తెలిపారు. గోదావరి పుష్కరాలు అంటే ఇప్పటివరకు రాజమండ్రి మాత్రమే గుర్తొచ్చేదని, ఇకపై తెలంగాణలోనూ పుష్కరాలను గ్రాండ్‌గా నిర్వహించేలా చర్యలు చేపడుతునట్లు వెల్లడించారు.

హైకమాండ్ నిర్ణయం ఎలా ఉన్నా.. మంత్రిగా విధుల్లో
పుష్కరాల నిర్వహణ కోసం ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించిందని కొండా సురేఖ చెప్పారు. ఈ ఏర్పాట్లలో భాగంగా పుష్కరాల స్పెషల్ ఆఫీసర్ కార్యాలయాన్ని ప్రజాభవన్‌లో ప్రారంభించారు. ముఖ్యమంత్రి ఆదేశాలకు అనుగుణంగా పుష్కరాల ఏర్పాట్లను వేగవంతం చేయాలని అధికారుల ను ఆదేశించినట్లు మంత్రి పేర్కొన్నారు. గోదావరి నది వెంట బాసర నుంచి భద్రాచలం వరకు ఉన్న ఆలయాల అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించిందని వెల్లడించారు. పుష్కరా లకు వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంతో పాటు ఆయా ప్రాంతాల్లోని దేవాలయాల ను అభివృద్ధి చేసేలా పనులు చేపడుతున్నామని చెప్పారు. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో పుష్కరాల పనులు ప్రారంభమయ్యాయని, మరికొన్ని పనులు టెండర్ దశలో ఉన్నాయని వివరించారు. ముఖ్యమంత్రి డైరెక్షన్‌లో అన్ని శాఖలను సమన్వయం చేసుకుంటూ పనులను వేగంగా పూర్తి చేయాలని అధికారులకు సూచించినట్లు తెలిపారు. దీని ద్వారా హైకమాండ్ నిర్ణయం ఎలా ఉన్నా.. అప్పటి వరకు తన విధుల్లో తాను కొనసాగాలని కొండా సురేఖ డిసైడైనట్లు స్పష్టం అవుతోంది.













Click it and Unblock the Notifications