వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హైదరాబాద్‌పై కెటిఆర్, పార్టీలో క్షోభ అనుభవిస్తున్నా, ఐనా: రాపోలు ఆవేదన

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: విశ్వనగరంగా ఎదిగేందుకు హైదరాబాదుకు అన్ని అవకాశాలు ఉన్నాయని తెలంగాణ ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు శుక్రవారం అన్నారు. కృష్ణా జలాల తరలింపు మూడో దశ పనులకు శుక్రవారం మాదాపూర్‌లో శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా ఏర్పాటు ఆయన మాట్లాడారు. మాదాపూర్‌, హైటెక్ సిటీలో పైప్‌లైన్‌ విస్తరణకు రూ.25కోట్లు కేటాయించామన్నారు. ఐటీ కారిడార్‌లో రూ.16 కోట్లతో రోడ్లను అభివృద్ధి చేస్తామన్నారు.

గచ్చిబౌలిలో నూతనంగా నిర్మించిన టీ హబ్ భవనాన్ని కెటిఆర్ పరిశీలించారు. ప్రపంచస్థాయి ప్రమాణాలు, సదుపాయాలతో ఈ భవనాన్ని సిద్ధం చేశారు. దేశంలోనే అతిపెద్ద ఇంక్యూబేటర్ సెంటర్‌గా పేరు పొందింది. టీ హబ్ ఇంక్యూబేషన్ సెంటర్‌లో సాఫ్ట్‌వేర్‌ల ఏర్పాటుకు ఔత్సాహికులు పోటీ పడుతున్నారు.

Minister KTR at Madhapur

హైదరాబాదును విశ్వనగరంగా మారుస్తాం: పోచారం

పొరుగు రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో రోడ్ల విస్తీర్ణం తక్కువగా ఉందని మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అభిప్రాయపడ్డారు. హైదరాబాద్‌ స్టాఫ్‌ కాలేజ్ ఆఫ్‌ ఇండియాలో రోడ్లు, బ్రిడ్జిల నిర్మాణం - పాటించాల్సిన సూత్రాలపై ఏర్పాటు చేసిన సదస్సుకు మంత్రి తుమ్మల ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఇండియన్‌ నేషనల్‌ గ్రూప్ (ఐఎన్‌జీ), అంతర్జాతీయ బ్రిడ్జ్‌ నిర్మాణం, ఇంజినీరింగ్‌ సంఘం, రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా ఏర్పాటు చేసిన రెండు రోజుల సదస్సుకు మంత్రి తుమ్మలతో పాటు పలువురు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.... స్కైవే, పైటాప్స్‌ రోడ్లతో హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నామని ప్రకటించారు. రాష్ట్రంలో రూ.10వేల కోట్లతో రోడ్ల పునరుద్ధరణ చేటప్టనున్నట్లు ప్రకటించారు.

పార్టీలో క్షోభ అనుభవిస్తున్నా: రాపోలు

ఏడాదిగా పార్టీలో అవమానాలతో తాను క్షోభను అనుభవిస్తున్నానని కాంగ్రెస్ రాజ్యసభ సభ్యులు రాపోలు ఆనంద భాస్కర్ అన్నారు. వరంగల్ ఉప ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి గెలుపుకు తన వంతు కృషి చేస్తానని చెప్పారు. కాంగ్రెస్
పార్టీ శ్రేయస్సే తనకు ముఖ్యమని చెప్పారు.

పార్టీలో తనను అవమానిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాహుల్ అదిలాబాద్ వచ్చినప్పుడు తనను అవమానించారన్నారు. రాహుల్‌ను ఆహ్వానించే బృందంలో ఉండే అర్హత కూడా తనకు లేదా అని ప్రశ్నించారు.రాష్ట్ర నాయకత్వం అందర్నీ కలుపుకొని పోతే మంచిదన్నారు. వరంగల్ ఉప ఎన్నిక హోరాహోరీ ఉంటుందని, ఇప్పుడే అంచనా వేయలేమన్నారు.

English summary
Telangana Minister KT Rama Rao at Madhapur.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X