హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చిన్నారి ప్రాణం కోసం.. మరోసారి గొప్ప మనసు చాటుకున్న కేటీఆర్..

|
Google Oneindia TeluguNews

మంత్రిగా తన కార్యకలాపాల్లో బిజీబిజీగా గడిపే కేటీఆర్.. సోషల్ మీడియా ద్వారా ఎప్పుడూ అందరికీ అందుబాటులో ఉంటారు. ఎవరైనా ఏదైనా సమస్యపై ట్విట్టర్‌లో విజ్ఞప్తి చేస్తే వెంటనే స్పందిస్తారు. అవసరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా సంబంధిత అధికారులను ఆదేశిస్తారు. అలా సామాన్య ప్రజలకు కేటీఆర్‌పై నమ్మకం ఏర్పడింది. అందుకే తరుచూ ఆయన ట్విట్టర్‌లో ఎవరో ఒకరు ఏదో ఒక సమస్యపై విజ్ఞప్తి చేస్తూనే ఉంటారు.

తాజాగా నల్గొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన ఓ యువకుడి విజ్ఞప్తి మేరకు యశస్వి అనే చిన్నారి వైద్యం కోసం ఆర్థిక సాయం అందించాలని కేటీఆర్ అధికారులను ఆదేశించారు. వారం రోజుల క్రితం ఆ చిన్నారి ప్రమాదవశాత్తు కాలు జారి భవనంపై నుంచి కిందపడింది. తీవ్ర గాయాలు కావడంతో బంజారాహిల్స్‌లోని ఓ ఆసుపత్రిలో చేర్చారు. అయితే యశ్వసి తల్లిదండ్రులు పేదవారు కావడంతో ఆసుపత్రి ఖర్చులు భరించలేని స్థితిలో ఉన్నారు. ఈ నేపథ్యంలో యశస్వి గురించి ఓ యువకుడు ట్విట్టర్ ద్వారా మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లాడు.

minister ktr helps medical assistance to a child

సానుకూలంగా స్పందించిన కేటీఆర్ చిన్నారి వైద్య ఖర్చులకు ఆర్థిక సాయం చేయాలని అధికారులను ఆదేశించారు. దీంతో వెంటనే సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి రూ.3.50లక్షలు మంజూరు అయ్యాయి. కేటీఆర్ సరైన సమయంలో స్పందించి ఆదుకోవడంతో చిన్నారి ప్రస్తుతం క్షేమంగా ఉందని.. ట్విట్టర్‌లో తన అభ్యర్థనను మన్నించి సాయం చేసినందుకు ధన్యవాదాలు అని ఆ యువకుడు తెలిపాడు. అతని ట్వీట్‌పై స్పందించిన కేటీఆర్.. చిన్నారికి సాయం చేసినందుకు సంతోషంగా ఉందన్నారు.

English summary
Minister KTR, who is busy with his activities as a minister, is always available to all through social media. If anyone appeals to Twitter on any issue, respond immediately. The relevant authorities are instructed to take necessary action.Recently he helped a little girl for medical treatment.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X