ప్రతిపక్షాలు అందులో బిజీ అంటూ మంత్రి కేటీఆర్ ఆసక్తికర ట్వీట్!!
తెలంగాణ రాష్ట్ర ఐటీ మరియు పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా ప్రతిపక్ష పార్టీల నుంచి టార్గెట్ చేస్తూనే ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కెసిఆర్ అభివృద్ధి చేస్తున్నారని చెబుతూనే, ప్రతిపక్ష పార్టీలు ఎన్నికల కోసం చేస్తున్న రాజకీయాలను తూర్పారబడుతున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యం బంగారు తెలంగాణ అని స్పష్టం చేస్తున్న కేటీఆర్ తాజాగా మళ్లీ ట్విట్టర్ వేదికగా ప్రతిపక్షాలకు చురకలంటించారు.
ప్రతిపక్ష పార్టీల నేతలు వచ్చే ఎన్నికల కోసం ప్రణాళికలు రచించి చాలా బిజీగా ఉన్నారని, కానీ మన దార్శనిక నాయకుడైన కేసీఆర్ దానికి మౌలిక సదుపాయాలను కల్పించడంలో బిజీగా ఉన్నారని కేటీఆర్ పేర్కొన్నారు. హెల్త్ కేర్, మెడికల్ ఎడ్యుకేషన్ రంగాలలో విప్లవాత్మక మార్పుకు నాంది పలికి తెలంగాణలోని 33 జిల్లాల లోనూ రంగానికి పెద్దపీట వేశారని సోషల్ మీడియా వేదికగా ట్వీట్ చేశారు.

ఎప్పుడు తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల లో ఒక ప్రభుత్వ వైద్య కళాశాల ప్రభుత్వ నర్సింగ్ కళాశాల 500 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఉందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.స్వతంత్ర భారతదేశంలో ఈ అపూర్వమైన ఘనత అని పేర్కొన్న ఆయన తెలంగాణ రాష్ట్రం సాధించిన ప్రగతి కి దగ్గరకు రాగల మరి ఏదైనా భారతీయ రాష్ట్రం ఉందా అంటూ ప్రశ్నించారు.
దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి జరిగిందని దేశంలోనే ఒక ఇతర రాష్ట్రం తెలంగాణ రాష్ట్రానికి దరిదాపుల్లో కూడా లేదని మంత్రి కేటీఆర్ తన ట్వీట్ ద్వారా స్పష్టం చేశారు. తెలంగాణ సీఎం కేసీఆర్ దార్శనికత తోనే ఇదంతా సాధ్యమైందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.
ఇక నేడు రాజన్న సిరిసిల్ల జిల్లాలో కుటీర వ్యాపార పథకం క్రింద ఈరోజు మంత్రి కేటీఆర్ మంత్రి కొప్పుల ఈశ్వర్ తో కలిసి 124 మంది ఎస్సీ లబ్ధిదారులకు ఆర్థిక సహాయం అందజేశారు.దళిత సమాజంలో పరివర్తన కృషి చేస్తున్నామని, దళిత బంధు మొదటి విడతలో సుస్థిర జీవనోపాధి లబ్ధిదారులు పొందేలా యూనిట్ల మంజూరు చేశామని కేటీఆర్ అన్నారు.సీఎం కేసిఆర్ నాయకత్వంలో దేశంలో ఎక్కడా లేని విధంగా దళితులను ధనికులు గా చేసేందుకు దళిత బంధు కార్యక్రమం ప్రారంభించినట్లు తెలిపారు.












Click it and Unblock the Notifications