లీచెట్ శుద్ధి ప్లాంట్‌ను ప్రారంభించిన కేటీఆర్: 250 కోట్లతో నిర్మించిన రాంకీ సంస్థ
హైదరాబాద్: నగరంలోని జవహర్‌నగర్ డంపింగ్ యార్డ్ ప్రాంగణంలో కాలుష్య కారకాల వ్యర్థాల(లీచెట్) శుద్ధి ప్లాంట్‌ను రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్, మంత్రి మల్లారెడ్డి కలిసి శనివారం ప్రారంభించారు. రూ. 250 కోట్లతో రాంకీ సంస్థ రెండు ఎంఎల్డీల సామర్థ్యంతో ఈ ప్లాంట్‌ను నిర్మించింది. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. చెత్త కుప్పను గత ప్రభుత్వాలు తమకు వారసత్వంగా ఇచ్చివెళ్లాయని.. జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ గత ప్రభుత్వాల శాపమని అన్నారు.
ప్రస్తుతం చెత్త నుంచి కరెంట్‌ను ఉత్పత్త చేస్తున్నామని కేటీఆర్ తెలిపారు.
ఈ శుద్ధి ప్లాంట్‌ను రూ. 250 కోట్లతో రాంకీ సంస్థ రెండు ఎంఎల్డీల సామర్థ్యంతో నిర్మించింది. కలుషిత వ్యర్థ జలాలను సంపూర్ణంగా శుద్ధి చేసేందుకు ఒక సమగ్రమైన పరిషారాన్ని సిద్ధం చేసిన జీహెచ్‌ఎంసీ.. 2020లో సుమారు రూ.250 కోట్లతో జవహర్‌నగర్ డంప్ యార్డులో వ్యర్థ జలాల ట్రీట్‌మెంట్, మలారం చెరువుతో పాటు కృత్రిమ నీటి గుంటల రిస్టోరేషన్, శుద్ధి కార్యక్రమాన్ని రాంకీ సంస్థ చేపట్టింది.

ఏడాది కాలంగా కొనసాగుతున్న పనుల్లో భాగంగా ఇప్పటికే 43% మేర మలారం చెరువు శుద్ధి పూర్తయింది. ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్న కాలుష్య నియంత్రణ మండలి లాంటి ఏజెన్సీలు కూడా ఈ అంశాన్ని ధ్రువీకరించాయి. ఇప్పటికే జీహెచ్‌ఎంసీ మొదటి దశలో భాగంగా 5.7 ఎకరాల మేర ఉన్న చెరువు నీటిని శుద్ధి చేసింది.
Minister @KTRBRS inaugurated 2000 KLD Legacy Leachate Treatment Plant at Jawaharnagar Dump Yard, marking an important milestone in tackling water contamination & pollution.
— Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR) April 15, 2023
This plant and a series of other steps reflect a significant investment in environmental sustainability. pic.twitter.com/rDWrBW2mia
పేరుకుపోయిన మురికిని శుద్ధి చేసే పనులు కొనసాగుతున్నవి. త్వరలోనే మల్కారం చెరువు జలాలు శుద్ధి కానున్నాయి. పనులు పూర్తయితే జవహర్‌నగర్, పరిసర ప్రాంతాల్లో ఘన వ్యర్థాలతోపాటు, కలుషిత జలాల సమస్య కూడా పూర్తిగా నివారిస్తారు.
Will be inaugurating the Leachate treatment project at Jawahar Nagar Dump Yard tomorrow
— KTR (@KTRBRS) April 14, 2023
This will resolve the major challenge of contamination of water bodies in the vicinity & contain water pollution
✅ Capacity: 2000 KLD (Kilo Liters per day)
✅ Technology: Mechanical… pic.twitter.com/NAa1BZAfIx
-
ఏప్రిల్ రెండో వారంలో తెలంగాణాకు ప్రధాని మోదీ.. బీజేపీ బిగ్ ప్లాన్ ఇదే! -
HRA: హైదరాబాద్ లో ఉండే వారికి భారీ గుడ్ న్యూస్, ఏప్రిల్ 1 నుంచే.. -
రంజాన్ స్పెషల్ స్వీట్ "డబుల్ కా మీటా" ఇలా ట్రై చేస్తారా..? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు!












Click it and Unblock the Notifications