దమ్మున్న నాయకుడు కేసీఆర్; ప్రతిపక్ష నాయకులెవరూ ఆయన కాలిగోటికి సరిపోరు: మంత్రి కేటీఆర్

తెలంగాణ మంత్రి కేటీఆర్ సిరిసిల్లలో జరిగిన బీఆర్ఎస్ నియోజకవర్గ ప్రతినిధుల సభలో కీలక వ్యాఖ్యలు చేశారు. కెసిఆర్ కాలిగోటికి సరిపోయే నాయకుడు ప్రతిపక్షాలలో లేరని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ఒకరు మెదడు లేని బండి అని.. ఇంకొకరు పార్టీలు మారే చంటి అని..వాళ్ళా ప్రతిపక్షం అంటూ ఎద్దేవా చేశారు.

సీఎం కెసిఆర్ పరిపాలనలో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచిందని, దేశజనాభాలో మూడుశాతం ఉన్న తెలంగాణకు 30శాతం జాతీయ అవార్డులు వచ్చాయని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. కెసిఆర్ ప్రారంభించిన పల్లె ప్రగతి తో తెలంగాణ రాష్ట్రం ప్రగతి పథంలో ముందుకు నడుస్తుందని పేర్కొన్నారు. దేశమంతా తెలంగాణ మోడల్ అభివృద్ధి కోసం టిఆర్ఎస్ పార్టీని బిఆర్ఎస్ పార్టీగా రూపాంతరం చేశామని, మారింది పేరు మాత్రమేనని డిఎన్ఏ కాదంటూ పేర్కొన్నారు.

bandiktrrevanth

తెలంగాణ రాష్ట్రం సిద్ధిస్తుందని, యువతకు భవిష్యత్తు ఉంటుందని కేసీఆర్ నమ్మారని, అంగబలం, అర్ధబలం లేకున్నా తెలంగాణ రాష్ట్రం కోసం ముందుకు నడిచారని పేర్కొన్నారు. అంతకుముందు నేతలెవరూ ప్రజల్లో నమ్మకం సంపాదించలేక పోయారని, కానీ కేసీఆర్ మాత్రం ఉద్యమం నుంచి తప్పుకుంటే రాళ్లతో కొట్టి చంపాలని చెప్పిన దమ్మున్న నాయకుడు అంటూ వెల్లడించారు.

బీఆర్ఎస్ పార్టీని ప్రజలు ఎంతగానో ఆదరిస్తున్నారని మహారాష్ట్రలో సీఎం కేసీఆర్ 3 సభలు పెడితే లక్షల మంది జనాలు వచ్చారని పేర్కొన్నారు. అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ అంటూ నినాదాలతో హోరెత్తించారు అని పేర్కొన్నారు . తెలంగాణ రాష్ట్రంలో ఉత్తమ జాతీయ అవార్డులు సాధించిన గ్రామపంచాయతీలు ఎన్నో ఉన్నాయని పేర్కొన్న మంత్రి కేటీఆర్ ఇది గోల్మాల్ గుజరాత్ కాదు గోల్డెన్ తెలంగాణ అంటూ పేర్కొన్నారు.

 ktr

తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న ఎనిమిదేళ్ల లోనే తెలంగాణ అభివృద్ధి మన కళ్ల ముందు కనిపిస్తోందని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. రాష్ట్రంలో గత తొమ్మిదేళ్ల వ్యవసాయానికి 4.5 లక్షల కోట్ల రూపాయల ఖర్చు పెట్టామని, రైతుల కోసం ఇంతగా చేస్తున్న ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం తప్ప మరే ఇతర ప్రభుత్వం లేదని పేర్కొన్నారు.

పార్లమెంటు ఎన్నికలలో ఆదమరిస్తే పచ్చని పందిరి లో పాము జొర్రిందని బీజేపీని ఉద్దేశించి మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలు చేశారు. బిజెపి ని తరిమి కొట్టాల్సిన అవసరం అందరిపైనా ఉందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ఈరోజు ఊరూరా కార్యకర్తలు గులాబీ జెండా ఎగరేస్తుంటే గుండె పొంగి పోతుందని సంతోషం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రగతిని, కెసిఆర్ చేసిన అభివృద్ధిని క్షేత్రస్థాయిలోకి తీసుకు వెళ్లాల్సిన అవసరం ఉందన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+